మ‌లైకా గ‌ర్భ‌వ‌తి..ఇదంతా ఫేక్ అనేసిన‌ అర్జున్ క‌పూర్

Update: 2022-11-30 12:30 GMT
మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ కొన్నాళ్ల‌గా  డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. విష‌యాన్ని అధికారికం చేయ‌క‌పోయినా ఇద్ద‌రి మ‌ధ్య  రిలేష‌న్ షిప్ స్ర్టాంగ్ గా  ఉంద‌న్న‌ది వాస్త‌వం. వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉన్నా అవేమి త‌మ ప్రేమకి అడ్డంకి కాద‌ని ప‌బ్లిక్ గానే ప్రేమ‌క‌లాపం సాగిస్తున్నారు  ఈ నేప‌థ్యంలో జంట‌పై సోష‌ల్ మీడియాలో వీస్తోన్న వ్య‌తిరేక ప‌వ‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

రిలేష‌న్ షిప్ మొద‌లైన నాటి నుంచి ష‌రా మామూలుగా కొన‌సాగుతూనే ఉన్నాయి.  త్వ‌ర‌లో వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్న‌ట్లు కూడా వార్త‌లొస్తున్నాయి.  ఈనేప‌థ్యంలో మ‌లైకా అరోరా గ‌ర్భం దాల్చిన‌ట్లు బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. త్వ‌ర‌లో పండండి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డానికి మ‌లైకా  రెడీగా ఉందంటూ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ జంట లండ‌న్ లో ఉంది. అక్టోబ‌ర్ లోనే లండ‌న్ వెళ్లారు. అప్ప‌టి నుంచి లండ‌న్ లోనే ఉండ‌టంతో విష‌యం నిజ‌మే అంటూ క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కిస్తున్నాయి. తాజాగా వీటిపై కొద్ది సేప‌టి క్రిత‌మే  అర్జున్ క‌పూర్ ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా  స్పందించారు.  మీడియా క‌థ‌నాల‌పై ఆయ‌న మండిప‌డ్డాడు. ఈ క‌థ‌నాల్ని  'ఫేక్ గాసిప్స్ `  గా నిర్ధారించాడు.

`చాలా సాధార‌ణ విష‌యంలా   మీడియా అంత‌టా స్ర్పెడ్ అయింది. ఇది  అనైతికమైన చ‌ర్య‌. చెత్త వార్తలను ఇంకెన్నాళ్లు రాస్తారు.   జర్నలిస్ట్ లు ఇలాంటి కథనాలను  క్రమం తప్పకుండా రాస్తూనే ఉన్నారు. వాటి నుంచి  మేమే త‌ప్పించుకుంటున్నాం.

ఎందుకంటే ఇలాంటి వాటిని మేమ  పెద్ద‌గా ప‌ట్టించుకోం. కానీ కొన్నిసార్లు వాటిని తెలియ‌ని వారు నిజం అని న‌మ్మే ప్ర‌మాదం ఉంటుంది. అందుకే మాట్లాడాల్సివ‌స్తోంది. ద‌య‌చేసి  మా వ్యక్తిగత జీవితాల్లోకి రావొద్దు` అని రాసుకొచ్చారు.

అలాగే మ‌లైకా అరోరా స‌న్నిహితులు కూడా ఈ వార్త‌ల్ని ఖండించారు. ఇది కేవ‌లం నెట్టింట జ‌రిగిన ప్ర‌చారం మాత్ర‌మే. ఇందులో ఎలాంటి వాస్త‌వం లేదన్నారు. మ‌లైకా అరోరా కుటుంబ స‌భ్యుడు ఒక‌రు.. ఈటీమ్స్‌తో మాట్లాడుతూ.. `ఇది నిజం కాదు. ఇవి కేవలం పుకార్లు` అని పేర్కొన్నారు. దీంతో మ‌లైకా అరోరా గర్భ‌వ‌తి అని వ‌స్తోన్న మీడియా  క‌థ‌నాల‌కు పుల్ స్టాప్ ప‌డింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News