న‌న్ను మించిన అంద‌గ‌త్తె లేద‌నుకుంటోందా?

Update: 2023-01-07 00:30 GMT
తమిళ - మలయాళ పరిశ్రమలలో క‌థ‌నాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటున్న మాళవిక మోహనన్ ఎట్ట‌కేల‌కు తెలుగులో త‌న తొలి అవ‌కాశం అందుకుంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న జాక్ పాట్ కొట్టేసింది. ఈ చిత్రానికి మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ - మాళ‌విక ప్ర‌భాన పాత్ర‌ల్లో మారుతి తెర‌కెక్కిస్తున్న `రాజా డీల‌క్స్` తో విజ‌యం అందుకుని టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోవాల‌ని క‌ల‌లు గంటోంది. అయితే అంత‌కు ముందే సోష‌ల్ మీడియా ల్లో గ్లామ‌ర్ డాళ్ గా విరుచుకుప‌డుతోంది. హ‌ద్దులు చెరిపేసిన మాళ‌విక వ్య‌వ‌హారం ఇటీవ‌ల‌ శ్రుతిమించుతోంద‌న్న చ‌ర్చా అభిమానుల్లో వేడెక్కిస్తోంది. గ‌త కొంత‌కాలంగా మాళ‌విక షేర్ చేస్తున్న అల్ట్రా గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. స్వ‌త‌హాగానే ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కుమార్తె కావ‌డంతో ఆ టింజ్ మాళ‌విక ఫోటోషూట్ల‌లోను ఎలివేట్ అవుతోంది. ఈ యంగ్ బ్యూటీ ఏం చేసినా తాను అశించిన విధంగా ప‌రిశ్ర‌మ‌లో ముందుకు వెళుతోంది. టాలీవుడ్ లో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఇక్క‌డ గోల్డెన్ లెగ్ అని నిరూపిస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.

తాజాగా మాళ‌విక షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో గుబులు పుట్టిస్తోంది. డార్క్ షేడ్ లో క‌నిపిస్తున్న ఈ హాట్ ఫోటోషూట్ కి బ్లాక్ అండ్ బ్లూ అంటూ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ప్ర‌స్తుతం యువ‌త‌రం ఈ ఫోటోల‌ను జోరుగా వైర‌ల్ చేస్తోంది. మాళ‌విక టూహాట్ అంటూ బోయ్స్ వ్యాఖ్యానిస్తున్నారు. న‌న్ను మించిన అంద‌గ‌త్తె లేద‌నుకుంటోందా? అంటూ ఒక అభిమాని కామెంట్ చేసారు.

2013లో మలయాళ చిత్రం `పట్టం పోల్‌`తో తెరంగేట్రం చేసిన మాళ‌విక‌ వరుసగా రజనీకాంత్ - విజయ్ సరసన పెట్టా - మాస్టర్ వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టించింది. మజిద్ మజిదీ దర్శకత్వం వహించిన విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం `బియాండ్ ది క్లౌడ్స్‌`లో త‌న అద్భుత‌ నటనకు ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు మారుతీ తెర‌కెక్కిస్తున్న `రాజా డీలక్స్‌`లో ప్రభాస్ సరసన తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తుండ‌డంతో క‌ళ్ల‌న్నీ ఈ అమ్మ‌డిపైనే. ఇటీవ‌ల ప్ర‌భాస్ అభిమానుల్లో మాళవికలో హాట్ నెస్ గిలిగింత‌గా మారింది. మాళ‌విక హాట్ ఫోటోషూట్ల‌ను ఫ్యాన్స్ జోరుగా వైర‌ల్ చేస్తూ వాటికి త‌మ వ్యాఖ్య‌ల‌ను జోడిస్తున్నారు. నిజానికి మాళవిక మోహనన్ కి రవితేజ సరసన తొలిగా ఆఫర్ వచ్చింది. కానీ ఆ పాత్రను తిరస్కరించింది.  అంత‌కుముందు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న‌ `హీరో` చిత్రంలో అవ‌కాశం అందుకుంది. కానీ ఈ చిత్రం ప్రారంభ‌మై మ‌ధ్య‌లో నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స‌ర‌స‌న `రాజా డీలక్స్`లో మానసిక వైద్యనిపుణురాలిగా కనిపించనుంద‌ని సమాచారం.

మాళ‌విక‌ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో కొత్త సంవత్సర వేడుకల నుంచి వ‌రుస ఫోటోల‌ను అభిమానుల కోసం షేర్ చేసింది. డిసెంబ‌ర్ 31 సెల‌బ్రేష‌న్ కోసం హిమాలయాలకు వెళ్లాన‌ని కూడా తెలిపింది. అక్కడ వెండి త‌ళుకుల‌ శిఖరాగ్రంపై కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News