అటు హీరోయిన్ కెరీర్.. ఇటు చదువు!

Update: 2018-11-21 04:05 GMT
హీరోయిన్ మాళవిక ఇప్పటివరకూ చేసినవి తక్కువ చిత్రాలే అయినా అవన్నీ మంచి కంటెంట్ ఉండే సినిమాలే. 'ఎవడే సుబ్రమణ్యం' నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన 'టాక్సీవాలా' వరకూ మాళవిక మంచి సినిమాలతో పాటూ మంచి పాత్రలను కూడా ఎంచుకుంది.  ఈమధ్యే తన కెరీర్ కోసం హైదరాబాద్ కు షిఫ్ట్ అయిందట.

ఇప్పటివరకూ చాలామంది హీరోయిన్లు అలా చేశారు కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. కానీ ఇంట్రెస్టింగ్ సంగతి ఏంటంటే మాళవిక బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిలో చేరింది.  తన కెరీర్ పై ఫోకస్ చేయడంతో పాటుగా చదువుకూడా పూర్తి చేస్తుందట. హిస్టరీ -ఇంగ్లీష్ లిటరేచర్ - పొలిటికల్ సైన్స్ లో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిందట.  రెగ్యులర్ గా క్లాసులకు హాజరవుతానని.. కష్టపడి చదువుకునే అమ్మాయినని అంటోంది. కాలేజిలో తనను ఒక సెలబ్రిటీలా గా చూడడం మాత్రం నచ్చడం లేదని అంటోంది.

ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయిన #మీటూ గురించి మాట్లాడుతూ..  ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయింది.  నావరకూ నేను ఆలాంటివి ఇంతవరకూ ఎదుర్కోలేదు. ఆ విషయంలో నేను లక్కీ అనుకుంటున్నాను. మహిళల పట్ల ఇండస్ట్రీలో చిన్నచూపు ఉన్నమాట వాస్తవమే గానీ అది అన్ని చోట్ల ఉన్నదే.. టాలీవుడ్ ఒక్కచోట అలా ఉందనుకోవడం కరక్ట్ కాదు" అని చెప్పింది.

తన కెరీర్ గురించి మాట్లాడుతూ రెగ్యులర్ మాస్ సినిమా హీరోయిన్ గా తను సూట్ కాననే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే గ్లామర్ పాత్రలు యాక్సెప్ట్ చేసేందుకు తను రెడీగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది.
    

Tags:    

Similar News