మాళవిక.. నెక్స్ట్ ఏం చేస్తుందో మరి!

Update: 2020-04-21 22:30 GMT
మాళవిక నాయర్ తెలుగు లో నటించింది తక్కువ సినిమాలే .  'ఎవడే సుబ్రహ్మణ్యం'.. 'కళ్యాణవైభోగమే' లాంటి నాలుగైదు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేదు.  నిజానికి ఎక్కువమందికి ఈ హీరోయిన్ ఎవరో తెలియదు.  'ఎవడే సుబ్రహ్మణ్యం' హీరోయిన్ అంటే మాత్రం కొందరు గుర్తుపడతారు.

ఈ మలయాళం భామ చాలాకాలంగా హైదరాబాద్ లోనే మకాం పెట్టింది. ఎంతో మంది పరాయి భాషల భామలు ఇక్కడే మకాం పెడతారు కదా.. మాళవిక హైదరాబాద్ లో ఉండడంలో వింతేముంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఈ భామ ఇక్కడ చదువుకుంటోందట. అదే ప్రత్యేకత.  తెలుగు సినిమాల్లో ఛాన్సులు వస్తాయని ఇక్కడికి మకాం మార్చినప్పటికీ పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు.  ప్రస్తుతం మాళవిక చేతిలో ఉన్న ఒకే సినిమా 'ఒరేయ్ బుజ్జిగా'.  రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరో.  అయితే ఈ సినిమా ప్రస్తుతం కరోనా క్రైసిస్ కారణంగా వాయిదాపడింది.

ఈ కరోనా మహమ్మారి ప్రబలకముందు 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాకు ప్రమోషన్లు కూడా జరిగాయి. ఈ వేసవిలోనే విడుదలకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. అయితే థియేటర్లు మూతపడడంతో సినిమా ఎప్పుడువిడుదల అవుతుందో కాదో తెలియని పరిస్థితి నెలకొంది. మరి ఈ కరోనా రచ్చ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత అయినా మాళవికకు మంచి ఆఫర్లు వస్తాయా.. కెరీర్ లో మంచి బ్రేక్ దక్కుతుందా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News