బన్నీ- అట్లీ సమస్యలన్నీ ఓ కొలిక్కి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ ఓ ప్రాజెక్ట్ కి రంగం సిద్దం చేసిన చేస్తున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లోకి వచ్చిన సంగతి తెలిసిందే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ ఓ ప్రాజెక్ట్ కి రంగం సిద్దం చేసిన చేస్తున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కి సంబంధించి అట్లీ భార్య కూడా ఓ సందర్భంలో చిన్న హింట్ కూడా ఇచ్చారు. దీంతో ప్రాజెక్ట్ లాక్ అయిందని అంతా భావించారు. అప్పటికి త్రివిక్రమ్ తో బన్నీ ప్రాజెక్ట్ అన్నది చర్చల దశలో ఉంది. బలంగా గురూజీ పేరు వినిపించలేదు.
అయితే కాల క్రమంలో బన్నీకి అట్లీ స్టోరీ నచ్చలేదని..దీంతో బన్నీ ఎగ్జిట్ అయినట్లు....గురూజీకి ఫిక్స్ అయినట్లు మీడియాతో కథనాలు బలంగా వెలువడ్డాయి. అప్పటి నుంచి అట్లీ పేరు మళ్లీ వినిపించలేదు. అయితే ఈ మధ్య మళ్లీ బన్నీ- అట్లీ కలుస్తున్నారని వారం రోజులుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మొదట సెట్ అవ్వక పోవడానికి...ఇప్పుడు ట్రాక్ లోకి రావడానికి కారణాలు ఏంటి? అంటే కొన్ని విషయాలు లీక్ అవుతున్నాయి.
ఈ సినిమా నిర్మాణంలో బన్నీ వాటా అడిగినట్లు వినిపిస్తుంది. సన్ పిక్చర్స్ భాగస్వామ్యంలో గీతా ఆర్స్ట్ కూడా చేరుతుందని ప్రపోజల్ పెట్టాడట. దానికి సన్ పిక్చర్స్ అంగీకరించలేదట. కేవలం బన్నీ మార్కెట్ ఆధారంగా పారితోషికం చెల్లింపు లెక్కలోనే నిర్మాణం చేపడతామని సదరు సంస్ధ చెప్పడంతో బన్నీ వెనక్కి తగ్గినట్లు వినిపిస్తుంది. దీంతో బన్నీ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం...అట్లీ ఇతర హీరోలను చూసుకోవడం జరిగిందంటున్నారు.
అయితే ఇటీవలే బన్నీ ఓ మెట్టు దిగి అట్లీ అండ్ కోకి ఫోన్ చేసి సినిమా చేద్దాం అన్నాడట. నిర్మాణ సంస్థ కోట్ చేసిన పారితోషికం లెక్కల్లోనే పనిచేద్దామని చెప్పాడట. ఈ నేపథ్యంలో బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి వస్తుందని తెలుస్తోంది. అయితే బన్నీ పాన్ ఇండియా మార్కెట్ ని ఆధారంగా చేసుకునే వందల కోట్లే చెల్లించడానికి సన్ పిక్చర్స్ రెడీగా ఉందని వినిపిస్తుంది. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అతి త్వరలోనే అధికారిక ప్రకటనా వస్తుందని అంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.