గోవా బీచ్ లో హీరో మిస్టరీ డెత్

Update: 2018-01-17 06:10 GMT
ఒక్కసారిగా మలయాళ సినిమా పరిశ్రమ ఉలిక్కి పడింది. ప్రముఖ నిర్మాత పికెఆర్ పిళ్ళై తనయుడు సిద్ధూ ఆర్ పిళ్ళై మృతదేహం గోవాలో అచేతన స్థితిలో దొరకడం ఇప్పుడు సంచలంగా మారింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్న సిద్దు దుల్కార్ సల్మాన్ సెకండ్ షో సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇతని వయసు 27 సంవత్సరాలే. ఇతని డెడ్ బాడీ సోమవారం - జనవరి 15వ తేది పోలీసులు కనుకున్నారు. సరిగ్గా అప్పటికి మూడు రోజుల ముందు 12వ తేది సిద్ధూ గోవాకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

సముద్రంలో మునిగి చనిపోయినట్టుగా కొన్ని మీడియా రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈతకు వెళ్లి మునిగిపోయడా లేక ఎవరైనా పధకం ప్రకారం ఇలా చేసారా అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. సిద్ధూ ఇప్పటి దాక పదహారుకు పైగా సినిమాల్లో నటించాడు. చిత్రం - వందనం - అమృతంగమయా ఇవన్ని ఇతనికి పేరు తీసుకొచ్చాయి. వార్త విన్న దుల్కర్ సల్మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేసాడు. అతనిలో ఫైర్ తన మొదటి సినిమా సెకండ్ షోలోనే చూసానన్న దుల్కర్ ఇలా దుర్మరణం పాలు కావడం పట్ల బాధను వ్యక్తం చేసాడు. సిద్దూతో తన తల్లి కూడా అక్కడే ఉన్నారని వార్త. అదే రోజు సాయంత్రం సిద్దూ బాడీని  మొదట చూసింది ఆవిడే అని కథనాలు వెలువడుతున్నాయి.

సిద్దు నాన్న పిళ్ళై స్వస్థలం కేరళలోని త్రిసూర్. అక్కడ వాళ్ళ స్వగృహంలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. దుల్కర్ సహా మల్లు వుడ్ ప్రముఖులంతా అందులో పాల్గొనబోతున్నారు. లాస్ట్ ఇయర్ దిలీప్ వివాదం కేరళ సినిమాను కుదిపెస్తే ఇప్పుడు అంతుచిక్కని రీతిలో సిద్ధూ మరణం పెద్ద షాకే ఇచ్చింది. ఇది సహజ మరణమా లేకా హత్యా అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News