సినిమా ప్రమోషన్స్ అంటే ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పెరగాలన్న స్టార్స్ క్రేజ్ పెరగాలన్నా కూడా ఈ ప్రమోషన్స్ పాత్ర చాలానే ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ఎదో ఒక ప్రెస్ మీట్ ప్రమోట్ చేసేలా కాకుండా కొందరు డిఫెరెంట్ గా ప్రమోషన్స్ చేస్తారు. రీసెంట్ గా నేల టిక్కెట్టు భామ మాళవిక శర్మ కూడా అదే తరహాలో చేసింది. నేల టిక్కెట్టు పేరుకు తగ్గట్టుగానే సినిమా థియేటర్ కు వెళ్లి 20 రూపాయల టికెట్స్ అమ్మింది.
సినిమాల అడ్డ ఆర్టీసీ క్రాస్ రాడ్ లోని సంధ్యా థియేటర్ కు వెళ్లి అమ్మడు నెల టికెట్స్ అన్ని సింగిల్ సిట్టింగ్ లో అమ్మేసింది. ఆమె అమ్మినట్లు ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే టికెట్స్ మాత్రం బాగానే అమ్మింది కానీ అలా అని థియేటర్స్ లోకి వెళ్లలేదు కాదా అనే డౌట్ రాకుండా ఉండదు. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చుస్తే 22 కోట్లు దాటేసింది. మరి ఎంత వరకు వసూళ్లు చేస్తుంది అనేది పెద్ద సందేహమే.
ఎందుకంటే రవితేజ గత చిత్రం టచ్ చేసి చూడు 27 కోట్లకు పైగా బిజినెస్ అయినా కనీసం 10 కోట్ల కలక్షన్ ను కూడా ఈజీగా అందుకోలేకపోయింది. ఆ సినిమా దారుణమైన నష్టాలను చూపించింది. ఇక నేల టికెట్టు పై పెద్దగా అంచనాలు లేవు. కొత్తదనం ఎక్కువగా కనిపించలేదు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.