మీరు ఎన్ని క్లాసులు అయినా పీకండి.. దేశంలో స్ర్తీల పట్ల పరిస్థితులు బాగాలేదు అనండి.. స్ర్తీలను చాలామంది పురుషులు హీనంగా చూస్తున్నారు అనండి.. అలాగే సినిమాల్లో కూడా మహిళలను చూపించే తీరు మారాలి అనండి.. కాని మహేష్ బాబు దూకుడులో సమంతను కొట్టాడు.. ఖుషీలో పవన్ కళ్యాణ్ అమ్మాయిలను తిట్టాడు అంటూ ఉదాహరణలు మాత్రం ఇవ్వకండి. అలా ఇచ్చారో ఈ ఫ్యాన్స్ ఊరుకోరు. ఇప్పుడు కేరళలో అదే జరిగింది.
మహిళలపై మనం కథలను తీర్చిదిద్దే ధోరణి మారాలంటూ 'బెంగుళూరు డేస్' ఫేం హీరోయిన్ పార్వతి ఒక కామెంట్ చేసింది. కేరళ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో అమ్మడు ఆ మాట చెబుతూ.. మొన్ననే 'కసాబా' అనే సినిమాను చూశాను..ఒక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలా తిట్టొచ్చా అంటూ అడిగింది. అయితే ఒక సంవత్సరం క్రితం వచ్చిన ఈ సినిమాలో మమ్ముట్టి ఒక పోలీస్ ఎస్సై పాత్రలో కనిపించాడు. ఇందులో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి.. ఒక వేశ్యవాటికను నడిపే అమ్మాయి పాత్రలో కనిపించింది. ఇక ఆ సీన్లలో అమ్మాయిలను.. మనోడు బూతులు తిట్టేశాడు. అదొక మలయాళీ బాగ్ బాగ్ డికె బోస్ సినిమా అనుకోండి. దీని గురించి ఉదహరించిన పార్వతి.. అలా ఒక సూపర్ స్టార్ అమ్మాయిలను తిడితే.. ఇక బయట జనాలు అది చూసి ఏం నేర్చుకుంటారు? ఏం నిట్టూరుస్తారు? అని అడిగింది.
నిజానికి పార్వతి అడిగింది ముమ్మాటికీ నిజం. కాని ఫ్యాన్స్ మాత్రం.. మా హీరో పేరును వాడుకుని నువ్వు పబ్లిసిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్నావ్ అని ఒకరు.. సంవత్సరం క్రితం వచ్చిన సినిమాపై ఇప్పుడు గోల ఏంటి అని ఒకరు.. స్వయంగా కసాబా సినిమా దర్శకుడు నిర్మాత కూడా ఇదే తరహాలో పార్వతిని బూతులు తిట్టేస్తున్నారు. అవన్నీ కూడా సహిస్తాను.. కాని అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇకపోతే ఈ కసాబా సినిమా విడుదలైనప్పుడే.. ఆ సినిమా మీద హెచ్.ఆర్.సి లో కేసు నమోదైంది. మహిళా కమీషన్ లో ఆ కేసు ఇంకా నడుస్తోంది.