మెగాస్టార్ నోరు విప్పక తప్పలేదు

Update: 2017-12-29 13:25 GMT
చిలికి చిలికి గాలి వాన కావడం అంటే ఇదే. మలయాళంలో మెగాస్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న మముట్టి సాధారణంగా వివాదాల జోలికి వెళ్ళడు. ఇష్యూ ఏదైనా సైలెంట్ గా ఉండటం అతని స్వభావం. కాని ఫాన్స్ అలా కాదుగా. ఒకోసారి హద్దులు మీరి తమ హీరోకు చెడ్డ పేరు తీసుకురావడమే కాక నలుగురిలో సంజాయిషీ ఇచ్చుకునే పనులు చేస్తారు. మల్లు వుడ్ హీరొయిన్ పార్వతి విషయంలో నానా రచ్చ జరిగి వ్యవహారం అరెస్ట్ దాకా వెళ్లేసరికి మమ్ముట్టి మౌనం వీడి దీని గురించి నోరు విప్పాడు. ఇటీవలే తిరువనంతపురంలో జరిగిన ఐఫా వేడుకల్లో పార్వతి మాట్లాడుతూ  మమ్ముట్టి హీరోగా నటించిన కసాబా సినిమాలో మహిళలను కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాట్లాడింది. అంతే మమ్ముట్టి ఫాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో మూకుమ్మడిగా దాడి చేసారు. చంపేస్తాం, రేప్ చేస్తాం అంటూ నానా హంగామా చేసి చివరికి ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చే దాకా వదలలేదు.

మొత్తానికి రేప్ చేస్తాను అని పార్వతిని సోషల్ మీడియాలో బెదిరించిన మమ్ముట్టి అభిమానిని ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. ఇది ఇంకా ముదురుతోంది అని గమనించిన మమ్ముట్టి ఫైనల్ గా నోరు విప్పాడు. తన తరఫున మాట్లాడమని తాను ఎవరిని నియమించలేదని - ఫాన్స్ పేరుతో ఎవరైనా ఆగడాలు చేస్తే తాను బాద్యుడిని కానని క్లారిటీ ఇచ్చాడు. సున్నితమైన విషయాల గురించి ఆరోగ్యకరమైన చర్చ జరగాలే తప్ప ఇలా దాడులకు తెగబడటం తాను సమర్ధించనని మముట్టి సర్దిపుచ్చే ప్రయత్నం చేసాడు. జరిగింది మొత్తం తనకు పార్వతి మెసేజ్ చేసిందని, ఎవరి హీరో అభిమానులైనా ఇలా ప్రవర్తించడం తగదని సుతిమెత్తగా మందలించాడు. ఇది అక్కడ మాత్రమే కాదు తమిళ్ లో అజిత్-విజయ్ ఫాన్స్, తెలుగులో పవన్ కళ్యాణ్ ఫాన్స్ విపరీత ప్రవర్తనకు మారు పేరుగా మారుతున్నారు. ఇలా కంటితుడుపుగా మాట్లాడకుండా కాస్త గట్టిగా చెబితే తప్ప దారి తప్పిన కొందరు ఫాన్స్ మాట వినేలా లేరు.
Tags:    

Similar News