ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి. పదిమందీ ఆయన్ను చాలా హృదయశీలి దయాగుణం కలవాడని అనుకోవాలని.. మనోడు బాగా ధానధర్మాలు చేస్తుంటాడు. అలా ఆయన డబ్బులిచ్చాడో లేదో ఇలా ఆయన కటౌట్ పెట్టేస్తుంటారు ఊరి జనాలు. శ్రీరామనవమి సందర్భంగా ఈ రచ్చంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఊరిలో డ్యాన్సు ఆడటానికి వచ్చిన ఒక లేడీ.. ''పోస్టర్ నీదేనా.. పెద్ద పార్టీయే!!'' అంటూ ఆయన్ను పొగిడేస్తుంది. ఈయనగారి రిచ్చిన కథే ఇప్పుడు ప్రకాష్ రాజ్ డైరక్షన్ లో రూపొందిన ''మన ఊరి రామాయణం'' సినిమా.
అయితే మొన్నటివరకు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరో అనుకున్నాం కాని.. ప్రకాష్ రాజ్ ఆ రిచ్చి రాజా పాత్రను చేస్తుంటే.. ఆ డ్యాన్సర్ పాత్రలో ప్రియమణి మెరిసిపోతోంది. సో.. ప్రకాష్ ప్రియమణి జంటగా రూపొందుతున్న ఒక విలేజే కథే ఈ మన ఊరి రామాయణం అని చెప్పాలి. ట్రైలర్ అనాలో టీజర్ అనాలో తెలియని ఈ ట్రైలర్ మాత్రం బాగానే ఉంది. యథావిథిగా ప్రకాష్ రాజ్ తన నటకౌశల్యంతో ఆక్టుకుంటే.. ప్రియమణి సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో తనేంటో చూపించింది. త్వరలోనే ఈ సినిమాను ప్రకాష్ రాజ్ ప్రపంచానికి కూడా చూపించేస్తాడట.
అలాగే సినిమాకు ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం కమ్ పాటలు కూడా బాగున్నాయి. దీనిని ప్రకాష్ తెలుగు-కన్నడ బైలింగువల్ గా రూపొందించాడు. అది సంగతి.
Full View