చిన్న పిల్లల అభిరుచి, ఇబ్బందులు, వాళ్లు ఎదుర్కుంటున్న కష్టాల పై తెలుగు ఛానళ్లో ప్రదర్శించిన కార్యక్రమాలపై.. యూనిసెఫ్ ఓ అవార్డ్ ఫంక్షన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి లక్ష్మీ మంచు ముఖ్య అతిథిగా హాజరయ్యి, అవార్డుల ప్రదానం కూడా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీవీ పవర్ ఏంటో తనకు తెలుసని చెప్పింది లక్ష్మి. తను సరదాగా స్టార్ట్ చేసిన లక్ష్మీ టాక్ షో తర్వాత.. ఛానల్స్ పవర్ ఏంటో, ఎంతగా ప్రేక్షకులకు రీచ్ అవచ్చో తెలిసిందని చెప్పింది. అంతే కాదు.. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలను తక్కువగా చూస్తున్నారని ఆవేదన చెందిన ఆమె.. తను ఆ ట్రెడిషన్ ను బ్రేక్ చేస్తూ వారసురాలిగా ఎదిగానని గుర్తు చేసింది.
పిల్లలకు చాలా ఇబ్బందులు ఉంటాయని, వాళ్లను పెంచడంలో తల్లి కీలకపాత్ర పోషిస్తుందని మంచు లక్ష్మి అంటోంది. ఒక అమ్మగా ఆ సమస్య ఏంటో తనకు తెలుసని వివరించింది. చిన్నారుల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని.. ఇప్పటికే టీచ్ ఫర్ ఛేంజ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పింది మంచు లక్ష్మి.