డైనమిక్ లేడీ మంచు లక్ష్మి నిర్వహిస్తున్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో ఈమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలను అతిథులుగా పిలిచి బాలీవుడ్ చాట్ షోల తరహాలో బోల్డ్ స్టైల్ లో కార్యక్రమాన్ని నిర్వహించడం కొందరిని ఆకర్షించింది. ఈ షోలోనే సమంతా తమ వివాహానికి ముందే చైతుతో లివిన్ రిలేషన్ లో ఉన్నానని ఒక బాంబు పేల్చగా.. శృతి హాసన్ ఈమధ్యనే మద్యం అలవాటును మానేసిన విషయం చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది.
ఇలాంటి ఒకటి అరా అంశాలు ఓకె కానీ ఓవరాల్ గా 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కార్యక్రమం సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా అనే ప్రశ్న అడిగితే మాత్రం ఫెయిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వూట్(voot) ప్లాట్ ఫాం ఎక్కువమందికి తెలియక పోవడం. ఇది 'సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్' తరహాలో ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకుల్లో వూట్ కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఇందులోని కంటెంట్ ప్రేక్షకులకు చేరే అవకాశం తక్కువ. దీంతో మంచు లక్ష్మి షోకు సగానికి సగం మంది ప్రేక్షకులు దూరమయ్యారు.
ఇక షోకు వచ్చే అతిథులను కొన్ని సెన్సేషనల్ ప్రశ్నలు వేసి.. షాకింగ్ సమాధానాలు రాబట్టినా మొత్తం ప్రోగ్రాం చూస్తే మాత్రం పెద్దగా ఆసక్తికరంగా లేదనే అభిప్రాయం వినిపించింది. అందరికీ అందుబాటులో ఉన్న ప్లాట్ ఫాం అయితే ఇలాంటి కార్యక్రమాలకు రెడీమేడ్ ప్రేక్షకులు ఉంటారు. అందులోనూ ప్రోగ్రాం అద్భుతంగా ఉంటేనే చూస్తారు. ఈ రెండూ లేకపోవడంతో 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కార్యక్రమం ఆశించిన విజయం సాధించలేదని అంటున్నారు.