మగాళ్లు అలా చేస్తే ఓకే కానీ స్త్రీలు చేస్తే సహించరు.. నటి ఆవేదన
కళారంగంలో కథానాయికలను మారుతున్న వివిద దశలలో రకరకాల కోణాల్లో ఆవిష్కరించారు. ప్రతి దశాబ్ధానికొకసారి మహిళా పాత్రల చిత్రణ పూర్తిగా మారిపోయింది.
మారుతున్న ప్రపంచంలో మహిళల ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. పెరిగిన విద్య, సామాజిక జ్ఞానం, ఆర్థిక స్వేచ్ఛ కారణంగా స్త్రీలు ఇప్పుడు పురుషుల కంటే చాలా ఎక్కువ. స్త్రీ ఆకాశం ఎత్తు. అసలు మహిళ సాధించనిది లేనే లేదు. అంతరిక్షంలోకి కూడా ప్రయాణించగలదు. అయితే బాగా ఎదిగిన లేదా ప్రగతిశీల మహిళను పురుషాహంకారులు చూసే విధానం వేరు. ధైర్యంగా ప్రశ్నిస్తే లేదా ఎదురిస్తే ఆ మహిళను అహంకారి అని, దుర్మార్గురాలు అని ముద్ర వేస్తారు.
కళారంగంలో కథానాయికలను మారుతున్న వివిద దశలలో రకరకాల కోణాల్లో ఆవిష్కరించారు. ప్రతి దశాబ్ధానికొకసారి మహిళా పాత్రల చిత్రణ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సె*గా, టూమచ్ బోల్డ్‌గా కూడా చూపించారు. కొన్నిసార్లు వ్యాంపులుగా, ఐటమ్ గాళ్స్‌గా కూడా చూపించారు. 90లలో స్త్రీ పాత్రలకు గ్లామర్ ఎక్కువగా అద్దారు. వ్యాంప్ పాత్రలు కూడా అప్పట్లో ఎక్కువ. కానీ కాలక్రమంలో చాలా మారింది.పొగ తాగే లేదా మద్యానికి బానిసైన స్త్రీని కూడా 2000 -2010 మధ్యలో చూపించారు. పార్టీలో నైట్ క్లబ్ లలో కనిపించే స్త్రీ పాత్రలను నాటి దర్శకరచయితలు రాసుకునేవారు. అయితే ఇటీవలి కాలంలో నాయికా ప్రధాన చిత్రాలు పెరిగాయి. కథానాయికల రేంజ్ పెరిగింది. దీపిక, ఆలియా, కత్రిన వంటి నటీమణులు స్పై ఏజెంట్లుగా, పోలీస్ అధికారులగా నటించి మేల్ పాత్రలతో పోటీపడుతున్నారు.
అయితే మన దర్శకులు స్త్రీ పాత్రలను ఎప్పుడూ తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. మహిళా పాత్రలను ఒకప్పుడు అస్సలు హైలైట్ చేసేవారు కాదు. వారు గ్లామర్ ఎలివేషన్ కి లేదా డ్యాన్సులు చేయడానికి మాత్రమే పరిమితమయ్యేవారు. చాలా హా* గా ఎలివేట్ చేసేవారని కూడా ప్రముఖ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. 2000-2010 సమయంలో నాటి స్త్రీలను చాలా బోల్డ్ గా చూపించేవారని, అవి అప్పట్లో స్ట్రీరియో టైపిక్‌గా మారాయని కూడా రిచా విశ్లేషించారు. బలమైన ప్రగతిశీల ఆధునిక మహిళ ఇమేజ్‌ను నాటి పురుషులు జీర్ణించుకోవడం చాలా కష్టం అని కూడా వ్యాఖ్యానించింది.
పొగ తాగడం, ఆల్కహాల సేవనం వంటి దురలవాట్లను స్త్రీలలో చూపించినందున వారి ఇమేజ్ ను నాశనం చేసుకోవలసి వచ్చింది. ఒక మేల్ పాత్ర అలాంటివన్నీ చేస్తే అది వీరత్వం. కానీ లేడీ చేస్తే జీర్ణించుకోలేరు. పూర్తిగా దిగజారి మాట్లాడతారని రిచా చద్దా విమర్శించారు.