నటి మంచు లక్ష్మికి కోపమొచ్చింది. అదీ మామూలు కోపం కాదు.. బోలెడంత ఆవేదనతో నిండిన కోపం. ముఖ్యంగా విషయమేం లేకపోయినా ఏవో హెడ్డింగులు పెట్టి ఏదేదో వినిపించే యూట్యూబ్ ఛానళ్లపై మాటలతో దాడి చేసేసింది. మా ముఖాలు చూపిస్తూ డబ్బులు సంపాదించుకుని తిరిగి మమ్మల్నే ఛీప్ గా చూపిస్తారా అంటూ మండిపడిపోయింది.
‘‘వెబ్ సైట్లు.. ఛానళ్లు సెన్సేషలిజం కోసం ఆరాటపడి పోతున్నాయి. మా క్యారెక్టర్ ను కించపరిచేలా హెడ్డింగ్ ఏదో పెడతారు. తీరా ఏమిటని చూస్తే అందులో ఏమీ ఉండదు. వీళ్ల ఛానల్ కు ఒక క్లిక్ కు పైసానో.. రెండు పైసలో వస్తుంది. దానికోసం ఇండస్ట్రీలో వాళ్ల గురించి అంత దారుణంగా రాస్తారా మేము అంత ఛీపయిపోయామా? ఇలాంటి కామెంట్లే వాళ్ల ఇంట్లో వాళ్ల గురించి రాయగలరా? మేము సెలబ్రిటీలమే అయినా అందరిలాంటి మనుషులమే. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళితే ఓ అమ్మ.. ఓ కూతురు.. ఓ చెల్లి.. ఓ అక్కలమే. ఈ విషయం గుర్తుంచుకోవాలి. మా ముఖాలు చూపించి డబ్బులు సంపాదించుకుంటూ మమ్మల్ని అనే హక్కు వాళ్లకెక్కడుంది’’ అంటూ మంచు లక్ష్మి ఫైరయిపోయింది.
‘‘సైక్లోనో.. ఇంకోటేదో కష్టం వచ్చినప్పుడల్లా ముందు మేమే పరిగెడుతున్నాం. కానీ మాకు కష్టం వస్తే మా తరఫున ఒక్కరూ మాట్లాడటం లేదు. మేం ప్రొడక్షన్ చేయడం ద్వారా మరో 100 మందికి రోజూ తిండి దొరికేలా చేయగలుగుతున్నాం. ఎవరూ సినిమాలకు ఉచిత ప్రచారమేమీ చేయరు. డబ్బులిస్తేనే చేస్తారు. మా బతుకేదో మేం బతుకుతుంటే మామీదే రాళ్లేస్తున్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కయిన దాసరి నారాయణరావు గారు ఉండుంటే ఈ రోజున ఈ విషయం ఇలా బయట మాట్లాడాల్సి వచ్చేది కాదు. మాకు న్యాయం జరిగి ఉండేది’’ అంటూ తన ఆవేదన అంతా బయటపెట్టింది మంచు లక్ష్మి.