ఆ పేరు పెట్టగానే సిగ్గొచ్చేసింది -మంచు లక్ష్మి

Update: 2017-03-08 04:03 GMT
మంచు లక్ష్మి ఎంత ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాలీవుడ్ స్థాయిలో ట్రైనింగ్ తీసుకుని.. టాలీవుడ్ లో యాక్టింగ్ చేస్తున్న లేడీ ఈమె. ఇప్పటికే పలు కేరక్టర్లతో ఆకట్టుకున్న మంచు లక్ష్మి.. ఇప్పుడు తనే లీడ్ రోల్ లో నటిస్తూ లక్ష్మీ బాంబ్ మూవీ చేసేసింది. ఈ నెల 10న ఈ బాంబ్ విడుదల సందర్భంగా.. సినిమా సంగతులను స్వయంగా పంచుకుంటోంది ఈ మంచు బ్యూటీ.

'ఈ టైటిల్ వినగానే నాకు భలే  కోపం వచ్చి.. డైరెక్టర్ ను పట్టుకు తిట్టేశాను. ఏదైనా వర్క్ అయ్యే టైటిల్ పెట్టమన్నాను. కానీ సినిమా మొదలయ్యాక చాలామంది ఈ టైటిల్ బాగుందని చెప్పారు. నాక్కూ మార్కెట్ ఉంది.. నా పేరుతో సినిమా చేస్తున్నాం అనిపించినా..  నాకు సిగ్గులాంటివన్నీ తెగ వచ్చేశాయి' అని చెప్పిన మంచు లక్ష్మి.. లక్ష్మీ బాంబ్ మూవీలో జడ్జ్ పాత్ర పోషిస్తోంది. ఆ డ్రెస్ వేసుకుంటేనే తెలియని రెస్పెక్ట్ వచ్చేస్తుందని.. నాలుగు సింహాలు బాధ్యతను గుర్తు చేస్తాయని.. కూర్చున్న కుర్చీకి న్యాయం చేయాలని అనిపించిందని చెప్పింది.

బడ్జెట్ ప్లస్ డేట్స్ సమస్యల కారణంగా.. ఈ మూవీ క్లైమాక్స్ ఫైట్ ను మంచు మనోజ్ తో కంపోజ్ చేయించినట్లు చెప్పిన ఈమె.. క్లైమాక్స్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడినట్లు చెప్పింది. 'ఇప్పుడీ పాట మా అమ్మాయికి అన్నం తినిపించేందుకు పనికొస్తోంది. అమ్మదెయ్యం అయిపోతుంది తిను అని భయపెడుతున్నాం. మా అమ్మాయి కానీ యూట్యూబ్ లో చూసుంటే.. ఆ పాటకు ఇంకో లక్ష కౌంట్ పెరిగేది' అంటోంది మంచు బ్యూటీ.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News