15న మంచు వారి కొత్త వార్త
మంచు వారి ఇంట్లో నటీనటులు ఎంతమంది ఉన్నారో ప్రొడక్షన్ ల పేర్లు కూడా అన్ని ఉన్నాయి. అయితే మోహన్ బాబు మొదలు పెట్టిన సినీ జీవితాన్ని వారి వారసులు ఓ లెవెల్లో అలా నడుపుకుంటూ వస్తున్నారు. ఎవరికీ తగ్గట్టు వారు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందరికంటే డిఫెరెంట్ గా మంచు వారి కూతురు లక్ష్మి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే షోలతో పాటు ఇతర టాక్ షోలను ఆమె బాగానే చేశారు.
ఇక సినీ నిర్మాతగా మారి కొత్త కథలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ మధ్య నిర్మాతగా ఎక్కువగా కనిపించలేదు. అంతే కాకుండా నటిగా కూడా సినిమాలను తగ్గించేశారు. అయితే త్వరలో మంచు లక్ష్మి మళ్లీ తన టాలెంట్ ని చూపించడానికి సిద్ధమవుతోంది. అందుకు సంక్రాంతి డేట్ ని ఫిక్స్ చేసింది. జనవరి 15న తన కొత్త సినిమా అప్డేట్ ని అలాగే సినిమా టైటిల్ ని ఉదయం 10గంటలకు తెలియజేస్తాను అని ట్వీట్ చేశారు.
చివరగా మంచు లక్ష్మి దొంగాట సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు కానీ చిత్ర యూనిట్ కి మంచి గుర్తింపు తెచ్చింది. సొంత బ్యానర్ లోనే మంచు లక్ష్మి ఆ సినిమాను నిర్మించగా వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించాడు.