కొందరిపై కొన్ని సెంటిమెంట్లు బలంగా పని చేస్తాయి. అమ్మగారి ఇల్లు, అమ్మమ్మ పెరటిల్లు.. తాతగారి మామిడితోట .. ఇలా కొన్నిటితో గొప్ప అనుబంధం ఏర్పడిపోతుంది. బాల్యం పోయి.. ఎదిగొచ్చే వేళ.. ప్రయోజకులయ్యే క్రమంలో వాటిని తీపి గురుతులుగా గుర్తు చేసుకుంటారు.
తాతమ్మ ఊరు మర్చిపోరు. ఆ పెరటిల్లు అస్సలు మర్చిపోరు. జ్ఞాపకాల దొంతర్లలో తీయందాన్ని ఆస్వాధిస్తూ బతికేస్తుంటారు. అలాంటి కోవకే చెందుతుంది మంచు లక్ష్మి. పక్కా అధునాతన యువతి అయినా.. తనకి సెంటిమెంట్లు ఎక్కువే. ఓ బిడ్డ తల్లిగా వాటన్నిటినీ గుర్తు చేసుకుంటోంది ఇప్పుడు. తను చిన్నప్పుడు తిరగాడిన ఓ ఇంటిని ఎప్పటికీ మర్చిపోలేకపోతోంది. ఆ నట్టింట్లోనే తన గారాల పట్టి కూడా తిరగాలని పట్టుబడుతోంది. అందుకే శంషాబాద్‌లో ఖరీదైన బంగ్లా ఇస్తానన్నా అస్సలు నాకొద్దు బాబూ! అంటోంది. అంతేకాదు ఫిలింనగర్‌లోని ఆ ఇల్లే కావాలని మారాం చేస్తోంది.
అందుకే ఇటీవలే మంచు మోహన్‌బాబు ఈ ఇంటిని కోటి వెచ్చించి మరీ రెన్యువల్ చేయించారు. మనవరాలికి ఓ అరుదైన కానుక. కూతురికి అదే ఓ బహుమానం.. అన్న పద్ధతిలో ఈ పనిచేశారాయన. ఈ సంగతులన్నీ ఎవరు చెప్పారో తెలుసా? ఇంకెవరు.. లక్ష్మీ మంచు.. స్వయంగా తన నోటితోనే చెప్పారు సుమీ..