మనోజ్ కి నచ్చిన వంటిల్లు ఇదేనట!

Update: 2016-07-27 08:24 GMT
సినిమాహీరోలకు - హీరోయిన్స్ కు నచ్చే విషయాలు ఎప్పుడూ హైరేంజ్ లో ఉంటాయి. లేదా విదేశాల్లో ఉంటాయి. అందరికీ అందుబాటులో లేనివే వారికి చాలా ఇష్టమైన విషయాలు అవుతాయి అంటుంటారు. అయితే సినిమా హీరోల్లో చాలా బోళామనిషి, మంచివాడు, అందరినీ కలుపుకుపోయేవాడు అని పేరున్న మంచు మనోజ్ తాజాగా ఒక విషయం అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఉన్నంతలో మంచి ఫిజిక్ నే మెయింటైన్ చేస్తూ ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా తయారైన మనోజ్ మాంచి భోజన ప్రియుడు. దీంతో నోరుకట్టేసుకోవడం, డైటింగ్ పేరుతో నచ్చేభోజనానికి దూరంగా ఉండటం కాకుండా పుష్టిగానే భోంచేస్తాడు.

ఇంతకూ..షూటింగుల నిమిత్తం వివిద దేశాలు, రకరకాల ప్రాంతాలు తిరిగే ఈ హీరోకు బాగా నచ్చిన రెస్టారెంట్ ఏమిటో, ఎక్కడుందో తెలుసా? మలేషియా - చైనా - సింగపూర్ - అమెరికా  - స్విట్జర్లాండ్... ఆగండాగండి... మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అది కూడా వైజాగ్ లో!! అవును ప్రసుతం వైజాగ్ లో షూటింగ్ లో బిజీగా ఉన్న మనోజ్ తన ఫేవరెట్ హోటల్ కి వెళ్లి టిఫిన్ చేశాడు. ఆ విషయాన్ని, తనకు అంత రుచికరమైన వంటలను అందించిన వ్యక్తిని అభిమానులకు పరిచయం చేశాడు. వైజాగ్ లోని వెంకటాద్రి వంటిల్లు అంటే మనోజ్ కి చాలా ఇష్టమట. ఆ హోటల్ లో దొరికే టిఫిన్ తనకు చాలా ఇష్టమని ట్వీట్ చేశాడు.
Tags:    

Similar News