హీరోలపై సెటైర్లు..మనోజ్-తేజులకు మండింది

Update: 2018-04-26 09:37 GMT
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి.. మీడియాకు అస్సలు పొసగడం లేదు. ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తున్నారు కొంతకాలంగా. ఐతే ఇంతకుముందు ఫిలిం ఇండస్ట్రీ మీడియా విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించేది. ఏమంటే ఏమవుతుందో అని ఇండస్ట్రీ జనాలు భయపడేవాళ్లు. కానీ శ్రీరెడ్డి ఇష్యూలో మీడియా వ్యవహరించిన తీరుతో విసుగెత్తిపోయిన సినీ జనాలు యుద్ధానికి సిద్ధమైపోయారు. మీడియాకు కంటెంట్ ఇవ్వకూడదని.. వాళ్లకు ప్రకటనలు కూడా జారీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మీడియాను లక్ష్యంగా చేసుకుని బోల్డ్ కామంట్లు చేస్తుండటంతో మిగతా హీరోల్లోనూ చురుకుపుట్టినట్లుంది. మీడియాను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడట్లేదు యువ కథానాయకులు.

తాజాగా ఒక టీవీ ఛానెల్లో బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ పేరుతో ఉదయం ఓ కార్యక్రమం నిర్వహించే ఒక ప్రెజెంటర్.. ఈ కార్యక్రమంలోకి సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చాడు. మహేష్ బాబు-రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి ఒకటికి రెండుసార్లు ఫొటో దిగిన నేపథ్యంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. హీరోలు తాము తాము బాగుంటామనే సందేశం ఇచ్చారని.. మీరు కొట్టుకు చావొద్దని అని అభిమానుల్ని ఉద్దేశించి ఆయన సూచన చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. హీరోలు పిచ్చి భ్రమల్లో ఉంటారని.. తెరమీదే హీరోయిజం చూపిస్తుంటారని.. నేరుగా వాళ్లను ఒక గుద్దు గుద్దితే కింద పడిపోతారని కామెంట్ చేశాడు. అంతే కాక హీరోలందరూ సైక్రియాట్రిస్టుల్ని సంప్రదించాలని కూడా సలహా ఇచ్చాడు. ఇది ఇండస్ట్రీ జనాలకు మండిపోయేలా చేసింది.

మంచు మనోజ్ దీనిపై స్పందిస్తూ.. ఇది బిజినెస్ బ్రేక్ ఫాస్టా.. కామెడీ బ్రేక్ ఫాస్టా.. అంత ఆవేశం ఎందుకు అని ఆ ప్రెజెంటర్ ను ప్రశ్నించాడు. ‘ఒక్కటి గుద్దుతాడు అంట.. సీరియస్లీ? నువ్వే గుద్ది నువ్వే పడిపోతావ్.. కూల్ బాబాయ్’ అని కామెంట్ చేశాడు. దీనిపై తర్వాత సాయిధరమ్ తేజ్ కూడా స్పందించాడు. ‘‘బాబాయ్ మనోజ్.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. త్వరగా కోలుకోండి సార్’ అంటూ సెటైర్ వేశాడు. 
Tags:    

Similar News