వికారాబాద్ లో అడ్వెంచర్ టూరిజం ప్లాన్ చేసిన మంచు మనోజ్

Update: 2021-08-08 04:55 GMT
ప్రకృతి సిద్ధమైన వనమూలికలకు కొలువైన అనంతగిరి కొండలు అడవి అందాలకు పుట్టినిల్లు.. వికారాబాద్ లోని ఈ అందమైన అడవిలో జలపాతాలు.. చెట్లు చేమలు ప్రకృతి పోసిన అందాలుగా ఇమిడి ఉన్నాయి.

ఈక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అనంతగిరి టూరిజం డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. దీనికి భారీ స్పందన రావడం విశేషం.

రాష్ట్ర మంత్రులు  శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డిలు తాజాగా వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి పై చర్చించారు. ప్రముఖ నటుడు మంచు మనోజ్ కుమార్  అడ్వెంచర్స్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు పై  రూపొందించిన పలు ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.

హీరో మంచు మనోజ్ అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు.ఈ మేరకు వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మనోజ్ ప్రతిపాదన మంత్రులను ఆకట్టుకుంది. సాధాసాధ్యాలపై చర్చించారు.

అనంతగిరి లో ఏర్పాటు చేయబోతున్న అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు హైదరాబాద్, తెలంగాణ  రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని టూరిజం అధికారులను ఆదేశించారు మంత్రి   శ్రీనివాస్ గౌడ్. క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేయాలని మంత్రులు టూరిజం ఎండీ మనోహర్ ఆదేశించారు.

అనంతగిరి హిల్స్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని మంత్రులు తెలిపారు.. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Tags:    

Similar News