మంచు మనోజ్ - రెజీనా జంటగా నటించిన శౌర్య శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని థ్రిల్లర్ కాన్సెప్ట్ కి క్యూట్ లవ్ స్టోరీని జత చేసి క్లాస్ చిత్రాల దర్శకుడు దశరథ్ రూపొందించాడు. వేదా.కె సంగీతం అందించిన శౌర్య ఆడియో వేడుకను ఈ నెల 31న హైద్రాబాద్ లో నిర్వహించనున్నారు.
శౌర్య కోసం మొదటి నుంచి డిఫరెంట్ గా ప్రమోషన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ ఈవెంట్లను కూడా ఘనంగానే నిర్వహించారు. 'ప్రేమ అనేది ఎవడికి వాడికి సెపరేట్ క్వశ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు పనికి రాదు, నా ఆన్సర్ నీకు పనికి రాదు' అంటూ పోస్టర్ పై రాసిన వర్డింగ్.. శౌర్య చిత్రంపై మరింత ఆసక్తిగి కలిగించింది. మనోజ్ ఇప్పటి వరకు కనిపించనంత క్లాస్ లుక్ తో.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్రం హిట్ కావడం ఇప్పుడు మంచు వారబ్బాయికి చాలా కీలకం.
గత కొన్నేళ్లుగా అసలు హిట్ అనే మాటే మర్చిపోయాడు మంచు మనోజ్. మరోవైపు హీరోయిన్ రెజీనా పరిస్థితి కడా ఇందే. సుబ్రమణ్యం ఫర్ సేల్ తో హిట్ కొట్టింది అనుకునే లోపే.. సౌఖ్యం లాంటి డిజాస్టర్ పలకరించింది. ఇక డైరెక్టర్ దశరథ్ అయితే.. ఐదేళ్ల క్రితం మిస్టర్ పర్ ఫెక్ట్ తో హిట్ సాధించాడంతే. ఆ తర్వాత వచ్చిన గ్రీకు వీరుడు దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. మరి మనోజ్.. రెజీనా.. దశరథ్..లకు టైమొచ్చింది కాబట్టి.. హిట్టు కొట్టేసి.. 'మా టైమొచ్చేసిందోయ్' అంటారేమో చూడాలి.