కొత్త ఇన్నింగ్స్ కి మంచు మ‌నోజ్ శ్రీ‌కారం..!

Update: 2022-12-16 10:30 GMT
మంచు మ‌నోజ్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. ఆయ‌న సినిమా చేసి దాదాపు ఐదేళ్లు దాటుతోంది. 2017లో మంచు మ‌నోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూత‌క్కి రూపొందించిన మూవీ 'ఒక్క‌డు మిగిలాడు'. మంచు మ‌నోజ్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్ట‌ర్ అనిపించుకుని షాకిచ్చింది. వ‌రుస‌గా సినిమాల ఫ్లాప్‌.. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర‌వ్వ‌డంతో మంచు మ‌నోజ్ సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు.

గ‌తంలో 'అహం బ్ర‌హ్మ‌స్మి' మూవీని రామ్ చ‌ర‌ణ్ క్లాప్ తో ప్రారంభించి భారీ హంగామా చేసిన మంచు మ‌నోజ్ ఆ మూవీని కూడా ప్రారంభంలోనే ఆపేశాడు. ఆ త‌రువాత వైఫ్ ప్ర‌ణ‌తిరెడ్డికి 2019లో విడాకులిచ్చిన మంచు మ‌నోజ్ అప్ప‌టి నుంచి సినిమాల‌కు, సినిమా ఇండ‌స్ట్రీకీ మ‌రింత దూరంగా వుంటూ వ‌స్తున్నారు. దీంతో మ‌నోజ్ ఇక సినిమాలు చేయ‌డా? శాశ్వ‌తంగా త‌ను సినిమాల‌కు దూర‌మైనట్టేనా అంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

అయితే మంచు మ‌నోజ్ మాత్రం తాను మ‌ళ్లీ సినిమాలు చేస్తాన‌ని ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో మ‌నోజ్ సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పిన‌ట్టేనా? అంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే తాజాగా మంచు మ‌నోజ్ స్లిమ్ లుక్ కి సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేమ‌య‌డంతో మ‌నోజ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌బోతున్నారనే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో మంచు మ‌నోజ్ శుక్ర‌వారం క‌డ‌ప పెద్ద ద‌ర్గాని సంద‌ర్శించి మ‌ళ్లీ కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తానంటూ ప్ర‌క‌టించ‌డం విశేషం.

త్వ‌ర‌లో కొత్త జీవితంలో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నాన‌ని మంచు మ‌నోజ్ శుక్ర‌వారం ప్ర‌క‌టించాడు. క‌డ‌ప పెద్ద ద‌ర్గాని శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశాడు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఎప్ప‌టి నుంచో తాను ద‌ర్గాని సంద‌ర్శించాలని అనుకుంటున్నానని.. ఇప్ప‌టికి ఆ క‌ల నెర‌వేరింద‌న్నాడు.

త్వ‌ర‌లో కుటుంబంతో క‌లిసి మ‌ళ్లీ ద‌ర్గాకు వ‌స్తాన‌ని వెల్ల‌డించాడు. గ‌తంలో ఆపేసిన 'అహం బ్ర‌హ్మ‌స్మి'ని మంచు మ‌నోజ్ మ‌ళ్లీ రీ స్టార్ట్ చేస్తాడా?  లేక కొత్త ప్రాజెక్ట్ ల‌ని ప్ర‌క‌టిస్తాడా? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News