మంచు మనోజ్ కొన్ని కారణాల వల్ల భార్య నుండి విడిపోయిన విషయం తెల్సిందే. మనోజ్ భార్యకు దూరంగా ఉంటున్నాడు అంటూ చాలా కాలం వార్తలు వచ్చాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఔను నేను ఆమె నుండి విడిపోతున్నాను అంటూ ప్రకటించాడు. ఆ ప్రకటన మంచు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. చాలా కాలంగా సినిమాలు చేయకుండా సామాజిక కార్యక్రమాలు.. రాజకీయాలు అంటూ చిత్తూరు హైదరాబాద్ తిరుగుతున్న మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ లో త్వరలో ఒక ఆసక్తికర విషయాన్ని మీకు చెప్పబోతున్నాను అంటూ నేడు ట్వీట్ చేశాడు.
మనోజ్ ట్వీట్ కు నరేష్ అనే వ్యక్తి మరో పెళ్లి ఏమైనా చేసుకోబోతున్నారా అంటూ కామెంట్ పెట్టాడు. మనోజ్ కామెంట్ కు రెస్పాండ్ అయ్యాడు. నరేష్ కామెంట్ పై స్పందిస్తూ 'వామ్మో'... అంటూ సమాధానం ఇచ్చాడు. మొదటి పెళ్లి పెటాకులు అవ్వడం తో మళ్లీ పెళ్లి అంటేనే మనోజ్ భయపడుతున్నట్లుగా ఉన్నాడు.
పెళ్లి అంటే వామ్మో అంటూ సమాధానం ఇవ్వడంతో ఏంటీ మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా బ్రదర్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రెండవ పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలను చాలా మందిని చూశాం. వారంతా కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. మరి ప్రశాంతత లేకుండా మనోజ్ ఇలా సోలోగా ఎన్నాళ్లు ఉంటాడు అంటూ మంచు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మంచు మనోజ్ చెప్పబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రాలేదు.