మంచు కుటుంబంలో ఎవరైనా సరే ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఇలా మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకొంటారేమో అన్న భయం వాళ్లల్లో అస్సలు కనిపించదు. తర్వాత జరిగే పరిణామాల్ని ధైర్యంగా ఫేస్ చేస్తారు కానీ... మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి మాత్రం మాట్లాడరు. ఆ లక్షణం చాలా మందికి నచ్చుతుంటుంది కూడా. మంచు కుటుంబంలో ఎవరు మీడియా ముందుకొచ్చినా అందులో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఉంటాయి. తాజాగా మంచు విష్ణు కూడా ఓ ఇంటర్వ్యూలో తోటి హీరోలకి చురుకలు అంటిస్తూ మాట్లాడారు. ``ఐదు నిమిషాల పాత్రయినా చాలు నాకు. ఆ సమయంలోనే నేనేంటో నిరూపించుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకే మల్టీస్టారర్ సినిమాల్లో చిన్న పాత్ర వచ్చినా చేయడానికి నేను రెడీనే. కానీ ఆ విషయంలో నాకున్న కాన్ఫిడెన్స్ ఇతర హీరోల్లో కనిపించడం లేదు. వాళ్లకు భయమేమో`` అని ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు విష్ణు.
ఈ మాట అనడానికి కారణం `ఈడో రకం ఆడో రకం` సినిమాలో నటించడానికి తోటి హీరోలు ముందుకు రాకపోవడమే అని తెలుస్తోంది. మంచు విష్ణు - రాజ్ తరుణ్ కలిసి నటించిన ఆ చిత్రంలో మొదట రాజ్ తరుణ్ ప్లేస్ లో ఇద్దరు ముగ్గురు హీరోల్ని అనుకొన్నారు. కానీ వాళ్లు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదట. దీంతో రాజ్ తరుణ్ ని ఎంపిక చేసుకొని సినిమా చేశాడు విష్ణు. మొదట ఆ పాత్రని తిరస్కరించిన హీరోల్ని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు విష్ణు చురకలంటిస్తున్నాడు. సినిమాలో రాజ్ తరుణ్ చేసిన పాత్ర చాలా బాగుందని, ఆ పాత్రని చూసిన ఆ హీరోలంతా కుళ్లుకుంటారని చెప్పుకొచ్చాడు విష్ణు. బాలీవుడ్ లో హీరోలంతా కలిసి మెలిసి నటిస్తూ సినిమాల స్థాయిని పెంచుకొంటున్నారనీ, కానీ ఇక్కడ మాత్రం హీరోలంతా బావిలో కప్పల్లా మారారని విమర్శించాడు.