తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఐతే ఆయన ప్రతిభ కొన్నేళ్లుగా పరిశ్రమకు అంతగా ఉపయోగపడట్లేదు. మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. గత దశాబ్ద కాలంలో ఆయన వేళ్ల మీద లెక్కబెట్టే సినిమాలు చేశారు. హీరోగా కాకపోయినా.. ‘యమదొంగ’.. ‘బుజ్జిగాడు’ తరహాలో క్యారెక్టర్ రోల్స్ అయినా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు కానీ.. మోహన్ బాబు మాత్రం ఎప్పుడో కానీ ముఖానికి రంగేసుకోవట్లేదు. ఐతే మోహన్ బాబుకు అవకాశాలు రాకేం కాదని.. క్యారెక్లర్లతో పాటు భారీ పారితోషకాలు కూడా ఆఫర్ చేస్తున్నప్పటికీ ఆయనే అంగీకరించట్లేదని తనయుడు మంచు విష్ణు తెలిపాడు.
తన తండ్రి ఎవరి మాటా వినరని.. కథ.. అందులో తన పాత్ర నచ్చకపోతే సినిమా ఒప్పుకునే సమస్యే లేదని విష్ణు చెప్పాడు. ఈ మధ్య ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందని.. మూడు రోజులు మాత్రమే పని చేయాలని.. కోటి రూపాయలు పారితోషకం ఇస్తామని కూడా అడిగారని కానీ మోహన్ బాబు మాత్రం నో చెప్పారని విష్ణు వెల్లడించాడు. ఐతే రచయిత భారవి తీసిన ‘జగద్గురు ఆదిశంకర’లో తన పాత్ర నచ్చి పైసా పారితోషకం తీసుకోకుండా.. సొంతంగా కాస్ట్యూమ్స్ కూడా తనే సమకూర్చుకుని వారం రోజుల పాటుపని చేశారని విష్ణు తెలిపాడు. ‘మహానటి’ సినిమా కూడా పాత్ర నచ్చే చేశారని.. ఆయన గత కొన్నేళ్లలో వద్దనుకుని వదివేసిన పాత్రలు ఎన్నో ఉన్నాయని.. అలాగని తమకు డబ్బు అవసరం లేదని కాదని.. కానీ డబ్బు కంటే ఆత్మ సంతృప్తే ముఖ్యమని తన తండ్రి భావిస్తాడని విష్ణు అన్నాడు.