మంచు వారసుడు మనోజ్ నటించిన శౌర్య మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. దశరథ్ డైరెక్షన్ లో రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే మనోజ్ కంటే ఎక్కువగా కూడా అన్నయ్య విష్ణునే ఎక్కువగా ప్రమోట్ చేస్తుండడం విశేషం.
ఇలా మనోజ్ కంటే కూడా విష్ణు ఎక్కువ యాక్టివ్ గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై.. ఓ ఫ్యాన్ ట్విట్టర్ లో విష్ణుని ప్రశ్నించాడు. 'హలో విష్ణు గారు. హౌ ఆర్యూ? శౌర్య సినిమాని మీరు ఎందుకంతగా ప్రమోట్ చేస్తున్నారు. హీరో మనోజ్ అంతగా మీ సినిమాని ప్రమోట్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. సో చిల్' అంటూ ట్వీట్ చేశాడు ఓ ఫ్యాన్. ఈ ప్రశ్నకు విష్ణు నుంచి పంచ్ డైలాగ్ లాంటి ఆన్సర్ వచ్చింది.
'ఒక వేళ నీకు తెలీదేమో.. నేను అతని అన్నయ్యను. ఆ మాత్రం చేయాలి కదా. అయినా నా తమ్ముడి సినిమా అంటే.. నా సినిమా లాంటిదే కదా ' అంటూ ఆన్సర్ ఇచ్చాడు మంచు విష్ణు. నా తమ్ముడు మనోజ్ కోసం నేన ఏదైనా చేస్తా అంటూ.. అన్నయ్య విష్ణు ఎంత చక్కగా ఆన్సర్ ఇచ్చాడో కదా. సామాజిక సమస్యల పైనే కాదు.. కుటుంబ విషయాల్లోనూ చాలా నిక్కచ్చిగా ఉంటాడని విష్ణుకు ఇండస్ట్రీలో పేరుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే.