కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ''సన్ ఆఫ్ ఇండియా'' గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమాని ఓటీటీ కోసమే రూపొందించారు. అయితే చివరకు థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్డ్ షో నుంచే ప్లాప్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 థియేటర్లలో 'సన్నాఫ్ ఇండియా' ని రిలీజ్ చేయగా.. రెండో రోజు నుంచే చాలా వరకు థియేటర్లలో జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. మోహన్ బాబుకు మునుపటిలా మార్కెట్ లేదు కాబట్టి.. ఎవరూ ఈ చిత్రానికి భారీ వసూళ్లు ఎక్సపెక్ట్ చేయలేదు. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు కలెక్షన్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అసలు ఓపెనింగ్స్ రాకపోగా.. నెగిటివ్ షేర్ తీసుకురావడం శోచనీయం.
అయితే ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ విడుదలకు ముందు నుంచీ మంచు ఫ్యామిలీ మీద చేస్తోన్న ట్రోల్స్ కారణంగానే సినిమా ఆడలేదని స్టేట్ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. వందకు పైగా యూట్యూబ్ చానెల్స్ పనిగట్టుకొని మరీ మోహన్ బాబు సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశాయని.. అదే ఇంపాక్ట్ చూపెట్టిందని ఆరోపించారు.
మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ''నేను గత ఇరవై ఏళ్లుగా మోహన్ బాబుకు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇంత వరకు ఏ హీరోగానీ ట్రోల్ చేయలేదు.. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. 'సన్నాఫ్ ఇండియా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మంచు ఫ్యామిలీలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు - లక్ష్మీ ప్రసన్న లపై కొందరు ట్రోలర్స్ నోటితో చెప్పలేని అసభ్యకరమైన పదజాలంతో దూషించడం మొదలు పెట్టారు. ఒకటి కాదు వందకు పైగా యూట్యూబ్ చానల్స్ ఇలా చేశాయి'' అని అన్నారు.
''సినిమా రిలీజ్ అవ్వకముందే బాగాలేదని.. ఇలా ఉందని అలా ఉందని పని గట్టుకొని ‘సన్ ఆఫ్ ఇండియా’ పై నెగిటివ్ ప్రచారం చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశారు. ఆన్ లైన్ లో కొన్ని టిక్కెట్స్ బుక్ అయ్యాయి. మన దగ్గర డైరెక్ట్ గా థియేటర్స్ వచ్చి టికెట్ కొని చూసేవాళ్లు కూడా ఉంటారు. సినిమా చూడకుండానే బాగాలేదని ట్రోల్స్ చేయడం వల్ల సినిమాకు కలెక్షన్లు రాలేదు''
''సినిమా ఫ్లాప్ అయితే నటుడు, నిర్మాత మోహన్ బాబు ఒకరికే కాదు.. దీనిపై ఆధారపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్ - కో డైరెక్టర్లు -సినీ కార్మికులు సహా అందరిపై ఆ ప్రభావం పడుతుంది. ఈ సినిమాపోయినంత మాత్రాన మోహన్ బాబుకు వచ్చిన నష్టమేమీ లేదు. మరో సినిమా రెడీ అవుతోంది. త్వరలో మంచు విష్ణు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇక పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటి వెళితే దానిపై దుష్ప్రచారం చేశారు''
''సోషల్ మీడియాలో మంచు లక్ష్మీని అసభ్యకరమైన మాటలతో ట్రోల్ చేస్తున్నారు. మంచు విష్ణు 'మా' అధ్యక్షుడు అవడంపై ఓ వర్గం జీర్ణించుకోలేకపోవడం.. అక్కడి నుంచే ఇలా టార్గెట్ చేయడం జరిగింది. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ కొన్ని యూట్యూబ్ చానల్స్ బ్రతుకుతున్నాయి. అదీ ఒక బ్రతుకేనా?. మోహన్ బాబును యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు'' అని మంచు యువ సేన అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.