‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మంచు విష్ణుతోపాటు మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ తెలుగు వాళ్లందరం కలిసి సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ వేడుకకు నేను మా అధ్యక్షుడిగా రాలేదని.. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే వచ్చానని తెలిపారు.
నాకు ప్రాంతీయంగా మాట్లాడడం తెలియదని.. తెలుగు వాళ్లందరం కలిసి కట్టుగా ఉండాలని మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు వాళ్ల ఆత్మగౌరవం ఎక్కడ తగ్గినా అందరం ఒక్కటవ్వాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు మంచి పాలసీలతో ఇండస్ట్రీని కాపాడుతున్నారన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లం ఎవరిపైనా రాళ్లు విసరకూడదన్నారు. మేం మాట్లాడే విషయాల వలన ఇతరులు మాపై రాళ్లు విసరకూడదన్నారు.
సినీ ప్రముఖులు ఇచ్చే స్టేట్ మెంట్ ఏదైనా ఆచితూచి మాట్లాడాలని మంచు విష్ణు హితవు పలికారు. ఇండస్ట్రీలో ఉన్నవారు ఇచ్చే స్టేట్ మెంట్స్ అంతిమంగా సినీ పరిశ్రమపై పడుతాయని..కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండి అందరి తరుఫున స్టేట్ మెంట్ ఇవ్వాలన్నారు. లేదంటే వ్యక్తిగతంగా స్టేట్ మెంట్ ఇస్తున్నామని చెప్పుకోవాలని మంచి విష్ణు పిలుపునిచ్చారు.
నాకు ఎన్నికల్లో అండగా నిలబడి సలహాలు ఇవ్వడమే కాకుండా చాలాకాలంగా స్నేహంగా ఉన్నారు రామకృష్ణా గౌడ్, గురురాజ్. అందుకే వారికోసం ఈ కార్యక్రమానికి హాజరయ్యానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. మొత్తంగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మంచువిష్ణు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.