6 నెలలకే విడాకులు అంటోందిగా

Update: 2017-07-05 04:45 GMT
బిగ్ బాస్ సీజన్9 ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న భామ మందనా కరిమి. ఈమె ఓ ఇరానియన్ మోడల్ కాగా.. బాలీవుడ్ లో కూడా పలు మూవీస్ చేసింది. అయితే.. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్లయి 6 నెలలు గడవగానే విడాకులకు అప్లై చేసేసింది.

బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత.. కొన్ని నెలలకు ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాను పెళ్లి చేసుకుంది మందనా కరిమి. పెళ్లి చేసుకుని సరిగ్గా ఆరు నెలలు గడవగానే భర్తపై గృహ హింస కేసు పెట్టింది మందన. అంతే కాదు ఇప్పటికే విడాకులు కూడా దరఖాస్తు చేసేసింది. తనకు నెలకు 10 లక్షల రూపాయల చొప్పున భరణం ఇవ్వాలని.. ఈ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులకు పరిహారంగా 2 కోట్ల రూపాయలు చెల్లించాలని పిటిషన్ వేసింది. తన కెరీర్ ను కోల్పోయినందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించాలన్నది ఆమె వాదన.

పెళ్లయిన తర్వాత తన భర్త తాను సినిమాల్లో నటించేందుకు అంగీకరించలేదని.. దీంతో తాను అద్భుతమైన కెరీర్ ను కోల్పోయానన్న మందనా కరిమి.. 7 వారాల క్రితం తమ అత్తారింటి నుంచి తనను గెంటివేసినట్లు ఫిర్యాదు చేసింది. భర్తతో కలిసేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవేవీ నెరవేరకపోవడంతో చివరకు విడాకులకు దరఖాస్తు చేసుకుందట మందనా. బాలీవుడ్ లో పలు పెళ్లిళ్లు ఇలా పర్మనెంట్ గా పెద్ద మొత్తంలో భరణం కోసం జరుగుతుంటాయనే మాట.. ఇప్పుడు మందన కారణంగా మరోసారి తెరపైకి వచ్చింది.




Tags:    

Similar News