మీటూ ఉద్యమం పేరుతో ఎందరో పెద్ద మనుషుల పేర్లు బయట పడ్డాయి. పలువురు నాయికలు- గాయనీమణులు దిగ్గజాల పేర్లను ప్రస్థావించడంతో అది కాస్తా కోర్టుల పరిధికి చేరడం అనంతర రభస తెలిసిందే. తాజాగా ఒక రాంగ్ రీజన్ తో మణిరత్నంపై నెటిజనులు ఆగ్రహం చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మీటూ ఉద్యమం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ ని దాటి ఇండియాను తాకిన విషయం తెలిసిందే. ఉత్తరాదితో పాటు దక్షిణాది చిత్ర సీమల్ని ఈ వివాదం ఓ కుదుపు కుదిపేసింది. దీని బారిన పడిన చాలా మంది బాలీవుడ్ వ్యక్తులు చాలా వరకు ఒప్పుకున్న చిత్రాల నుంచి తప్పుకున్నారు కూడా. అయితే ఈ ఉద్యమాన్ని మాత్రం పేరున్న వ్యక్తులు పెద్దగా పట్టించుకోవడం లేదు. సమకాలీన సామాజిక అంశాల్ని కథా వస్తువుగా తీసుకుని తనదైన శైలి భావోద్వేగాల్ని జోడించి సినిమాలు తెరకెక్కించి దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న మణిరత్నం మాత్రం `మీటూ`కు మద్దతుగా నిలవడం లేదు.
ఇటీవల ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి `మీటూ` ఆరోపణలు చేయడం.. అవి దక్షిణాదిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా వైరముత్తుకు మణిరత్నం తన తాజా చిత్రం `పొన్నియన్ సెల్వన్`కు 12 పాటలు రాసే అవకాశం ఇవ్వడం నెటిజన్ లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న వైరముత్తుకు అవకాశం ఎలా ఇస్తారని సోషల్ మీడియాలో మణిరత్నంపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వెంటనే అతన్ని సినిమా నుంచి తొలగించాలని, రెహమాన్ కూడా ఈ విషయంపై స్పందించాలని మండిపడుతున్నారు. మీ టూ సెగ ఆ ఇద్దరికీ అలా వేరొక కోణంలో తాకిందన్నమాట.