మణిరత్నం. ఆయన పేరు వింటేనే రొమాన్స్ కూడా నిద్రలేచి కూర్చొని డ్యాన్స్ వేస్తుంది. ఆయన సినిమాల్లోని సున్నిత ఎమోషన్లకు మిలియన్లలో అభిమానులు ఉన్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో మణి వారూ పెద్దగా హిట్లేవి కొట్టలేదు. మొన్న వచ్చిన ఓకె బంగారం సినిమా తప్పిస్తే.. ఆయన ఖాతాలో హిట్టే లేదు.
ఇప్పుడు విషయం ఏంటంటే.. ఈరోజు విడుదలచేసిన ఆయన తదుపరి తమిళ సినిమా కాట్రు వెలియదై పోస్టర్ ను చూస్తుంటే ఒక్క విషయం అర్దమవుతోంది. ఫైటర్ జెట్ పైలెట్ గా పనిచేసి హీరో కార్తి.. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన హీరోయిన్ అదితీ రావ్ హైదారీ ప్రేమలో పడతాడు. పైగా స్టోరీ అంతా కాశ్మీర్ లో జరుగుతుందట. అంటే మళ్లీ గురువు గారు తీవ్రవాదం టచ్ చేస్తున్నారనమాట. గతంలో సేమ్ 'రోజా' సినిమా కూడా అంతేగా. హీరో ఆర్మీలో పనిచేసే ఒక క్రిప్టోగ్రాఫర్. అతగాడు మిస్సింగ్. రోజా అతడ్ని వెతుక్కోవడం.
అంతెందుకండీ.. మొన్న వచ్చిన ఓకె బంగారం సినిమా.. కథాపరంగా చూస్తే దాదాపు 'సఖి' సినిమా టైపులోనే ఉంటుంది. అదే ఫ్రేమ్ వర్క్. అంటే మణీ సారు తన సినిమాలను తానే మళ్ళీ ఇలా థీమ్ మార్చి రీమేకులు చేసుకుంటున్నట్లు లేదూ?