భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరనారిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా రూపొందిన మణికర్ణిక ఈ నెల 25న విడుదల కాబోతున్న సందర్భంగా దీని తెలుగు ట్రైలర్ ను విడుదల చేసారు. ఇంతకు ముందు వచ్చిన హిందీ వెర్షన్ కే ఎలాంటి మార్పులు లేకుండా కేవలం డబ్బింగ్ జోడించారు. ఇక దీని విషయానికి వస్తే ఆంగ్లేయులు కన్నేసిన ఝాన్సీ సంస్థానం కోసం కాచుకుని ఉంటుంది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే వర్తమానంలో ఉన్న యువరాజుకు వారసులు లేని కారణంగా రాజ్యం కోసం సాహసవంతురాలైన మాణికర్ణిక(కంగనా రౌనత్)ను కోడలిగా తెస్తారు.
అయితే ఇచ్చిన మాట కోసం దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే మాణికర్ణికకు అనుకోకుండా రాజు చనిపోయి వైధవ్యం సంభవిస్తుంది. రక్షణ భారాన్ని బిడ్డను ఒంటి మీద మోసుకుని యుద్ధరంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులు అధికారులు ఎంత బెదిరించినా లొంగదు. మరి ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా వాటికి ఎదురొడ్డి ఝాన్సీ రాజ్యాన్ని ఎలా రక్షించుకుంది అనేదే మణికర్ణిక. ట్రైలర్ లో విజువల్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఝాన్సీ రాణిగా కంగనా ఆహార్యం సరిపోయింది.
డానీ-కులభూషణ్ కుర్బందా-రవి కిషన్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి మన క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలిన కొంత భాగం కంగనా స్వయంగా పూర్తి చేసింది.శంకర్ ఎహ్సాన్ లే సంగీతం జ్ఞాన శేఖర్ కిరణ్ ల ఛాయాగ్రహణం స్థాయిని పెంచింది. జనవరి 25న అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతున్న మణికర్ణికకు చారిత్రాత్మక నేపథ్యం దీనికి ప్రధాన ఆకర్షణగా మారింది.
Full View