లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఏదైనా వేడుకల్లో మాట్లాడటం అరుదు. తన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో ఆయన సైలెంటుగా ఉంటారు. ఐతే తన కొత్త చిత్రం ‘కాట్రు వేళయిదే’ (తెలుగులో చెలియా) ఆడియో వేడుకలో ఆయన కొంచెం సుదీర్ఘ ప్రసంగమే చేశాడు. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తో తన ప్రయాణం పాతికేళ్లకు చేరిన నేపథ్యంలో ఆయన కొంచెం ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ వేడుకలో ఆయన రెహమాన్ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
‘‘రెహమాన్ తో నా ప్రయాణం మొదలై పాతికేళ్లు అయిపోయింది. ఐతే నిన్ననో మొన్ననో తనను కలిసినట్లుగా ఉంది. ఎప్పుడూ అతను అదే స్వచ్ఛమైన నవ్వుతో కనిపిస్తాడు. తనతో నా ప్రతి సినిమా ఒక ప్రత్యేక ప్రయాణం. ప్రతి సినిమాతోనూ రెహమాన్ ఒక కొత్త దారిని వెతుకుతాడు. ప్రతి చిత్రాన్ని తన తొలి చిత్రం లాగే భావించి తపనతో సంగీతాన్నందిస్తాడు. కొన్నిసార్లు రెహమాన్ మనం కోరుకున్నది ఇవ్వడు. బొంబాయి సినిమా కోసం తనను నేనో పాట అడిగాను. కానీ అతను పాట చేయలేదు. థీమ్ ట్రాక్ రెడీ చేసి పెట్టాడు. నేను రేపు షూటింగ్ కోసం పాట అడిగితే ఇలా చేశారేంటి అన్నాను. కానీ ఆ థీమ్ సాంగ్ విన్నాక అన్నీ మరిచిపోవడమే. అలా ఉంటుంది అతడి పని తీరు. ‘రోజా’ నుంచి ‘కాట్రు వేళయిదే’ వరకు రెహమాన్ తో నా ప్రయాణం అద్భుతం’’ అని మణిరత్నం అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/