తన సినిమాల గురించి తాను మాట్లాడాల్సిన పని లేదని.. తన సినిమాలే మాట్లాడతాయన్నది మణిరత్నం పాలసీ. ఇంతకుముందెన్నడూ తన సినిమాల గురించి ఆయన మాట్లాడింది లేదు. తన సినిమాల ఫంక్షన్లు చేయడమే తక్కువంటే.. అవి చేసినా మణి మౌనమునిలాగే ఉంటాడు. అసలు వేదికే ఎక్కడు. ఐతే ఈ ట్రెండులో మరీ అలా సైలెంటుగా ఉంటే కష్టమని మణిరత్నం అర్థం చేసుకున్నట్లున్నాడు. ఓకే కణ్మణి తమిళ ఆడియో సక్సెస్ మీట్‌కు వచ్చి.. నాలుగు ముత్యాలు రాల్చాడు. ఐతే నేరుగా ప్రసంగం చేయకుండా వ్యాఖ్యాత అడిగిన ఒకట్రెండు ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇచ్చాడు.
సహజీవనం మీద సినిమా ఎందుకు తీశారు.. సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''సామాజిక నియమాలను నా సినిమాల ద్వారానో, నేరుగానో చెప్పడానికి నేనేమీ హెడ్‌మాస్టర్‌ని కాను. ఎవరికి వారు సమాజంతో పాటే నేర్చుకునే అంశాలివి. ఇక్కడ ఎవరికి వారే జడ్జి'' అని తనదైన శైలిలో ముక్తాయించాడు మణి. ప్రఖ్యాత నృత్య కళాకారిణి లీలా శాంసన్‌ను 'ఓకే కణ్మణి'లో నటింపజేయడం తాను సాధించిన గొప్ప విజయమని.. ఆమె ఒప్పుకోవడం తన అదృష్టమని చెప్పాడు మణి. ఓకే కణ్మణి టీమ్‌తో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చిందని.. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలని మణి అన్నారు.