మణిరత్నం తెలుగులో మాట్లాడితే..

Update: 2017-03-22 07:39 GMT
మణిరత్నం అచ్చమైన తమిళ వ్యక్తి. కానీ ఆయన సినిమాలు సార్వజనీనంగా ఉంటాయి. ఏ ఒక్క భాషకో పరిమితమయ్యేలా ఉండవు. అందుకే తమిళంతో పాటే తెలుగులోనూ ఆయనకు బోలెడంతమంది అభిమానులున్నారు. ఆయన సినిమా వస్తుంటే మన ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిగా చూస్తారు. అందుకే తన సినిమాల తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా శ్రద్ధ పెడతారు మణిరత్నం. వేటూరి.. సీతారామశాస్త్రి లాటి ప్రసిద్ధ రచయితలతోనే ఆయన పాటలు రాయించుకుంటారు. మాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మణి నుంచి రాబోతున్న ‘చెలియా’ విషయంలోనూ మణి అలాంటి స్పెషల్ ఫోకసే పెట్టారు. ఆ విషయంలో ఈ చిత్ర పాటలు.. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

తెలుగు ప్రేక్షకుల గురించి అంతగా పట్టించుకునే మణి.. ‘చెల్లియా’ ఆడియో వేడుకలో తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేయడం విశేషం. తెలుగు మాట్లాడే విషయంలో తనకు తన భార్య సుహాసినే టీచర్ అని.. ఆమె తన ‘భార్యామణి’ అని.. అలాగే ఆమె ‘మణిభార్య’ అని మణిరత్నం చమత్కరించడం విశేషం. ఆమే తన ‘చెలియా’.. తన ‘బంగారం’ అని మణి వ్యాఖ్యానించి అందరిలోనూ నవ్వులు పూయించారు. తమిళం.. తెలుగులో చాలా పదాలు ఒకేలా ఉంటాయని.. అందుకే తాను కన్ఫ్యూజ్ అవుతుంటానని అన్న మణి.. ‘చెలియా’ పాటలకు సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం సమకూర్చారన్నారు. రెహమాన్-సీతారామశాస్త్రి ఈ చిత్రానికి పిల్లర్స్ లాంటి వాళ్లన్నారు. దిల్ రాజు చేతిలో ఈ సినిమాను పెట్టామని.. ఆయన దీన్ని బంగారం లాగా చూసుకుంటారని నమ్మకం ఉందని మణి అన్నారు. సతీ వియోగంతో ఈ వేడుకకు రాలేకపోయిన దిల్ రాజుకు సానుభూతి వ్యక్తం చేస్తూ తామందరం ఆయన కోసం ఉన్నామని మణిరత్నం చెప్పారు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News