'ఆచార్య'.. ఈ మధ్య కాలంలో ఈ సినిమాపై జరిగిన చర్చ మరే సినిమాపై జరగలేదు. మెగాస్టార్ చిరంజీవి ఊరి కోరి మరీ చేసిన సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ ఖచ్చితంగా వుండాల్సిందేనని పట్టుబట్టి మరీ చేశారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కి ఓ నైట్ మేర్ లా మారి వెంటాడుతోంది. చిరు నటించిన సినిమాల్లో అత్యంత డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీపై ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతూనే వున్నారు.
ఎక్కడ లోపం జరిగింది?.. ఎందువల్ల ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది? అనే విషయాలు అప్పుడప్పుడు బయటికి వస్తూనే వున్నాయి. ఈ మూవీ రిలీజ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి తను పాల్గొన్న చిన్న సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొంత మంది దర్శకుడు సెట్ లోనే డైలాగ్ లు, సీన్ లు రాస్తున్నారని, అలాంటి పద్దతిని మార్చుకోవాలంటూ ఇండైరెక్ట్ గా దర్శకుడు కొరటాల శివపై విమర్శలు చేశారు.
ఆ తరువాత కూడా నేరుగా కొరటాలని ట్రిగ్గర్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా విమర్శలు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చరక్చకు దారి తీసింది. రామ్ చరణ్ కూడా 'ఆచార్య' రిజల్ట్ పై పెదవి విరిచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ మెగా అభిమానుల్ని వెంటాడుతున్న 'ఆచార్య' ఫలితంపై తాజాగా సంగీత దర్శకుడు మణిశర్మ స్పందించారు. సినిమాకు మణిశర్మ అందించిన సంగీతంపై కూడా విమర్శలు ఎదురయ్యాయి. గతంలో మెగాస్టార్ నటించిన పలు సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
ఫ్లాప్ సినిమాలకు కూడా మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికీ మారు మ్రోగుతూనే వుంది. చూడాలని వుంది, బావగారు బాగున్నారా, ఇంద్ర, జై చిరంజీవ వంటి తదితర సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాల ఆడియో ఆల్బమ్స్ ఇప్పటికీ మెగా అభిమానుల్ని అలరిస్తూనే వుంటాయి. చిరు కు అలాంటి బ్లాక్ బస్టర్ ఆడియోలని అందించిన మణిశర్మ 'ఆచార్య'కు మాత్రం ఆ స్థాయి సాంగ్స్ ని, నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు.
దీంతో ఆయనపై చిరు అభిమానులు మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాజాగా ఆలీ టాక్ షోలో అడిగితే మణిశర్మ షాకింగ్ విషయాన్ని బయటపెట్టడం విశేషం. ఈ ఆల్బమ్ లో రెండు పాటలు హిట్టయ్యాయని, అయితే మిగతా పాటలకు కూడా ట్యూన్స్ ఇచ్చానని అయితే దర్శకుడు కొత్తగా కావాలని అడగడంతో వాటిని మార్చి వేరే ఇచ్చానని స్పష్టం చేశాడు.
అంటే తాను హిట్ సాంగ్స్ ఇచ్చానని కానీ దర్శకుడు కొరటాల శివనే అలాంటి ట్యూన్ లు తీసుకున్నాడని, అందులో తన తప్పేమీ లేదని ట్రిగ్గర్ ని కొరటాల శివ వైపు తిప్పడం ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా అంతా 'ఆచార్య' ఫ్లాప్ కి కారణం కొరటాల శివనే అని తేల్చేయడం కొసమెరుపు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.