ఆ వాయిస్ మాత్రం బాగా దెబ్బేసింది

Update: 2016-11-20 05:30 GMT
సాహసం శ్వాసగా సాగిపో.. సినిమా రిలీజై వారం అయిపోయినా కూడా.. శని ఆదివారాల్లో బుక్కింగులు బాగున్నాయి. ఇకపోతే సినిమా కంటెంట్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కథ కథనం ఎలా ఉన్నా కూడా.. అసలు గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరోయిన్లు ఉత్తినే అందరినీ పడేస్తారు. కాని నాగ చైతన్యకు పెయిర్ గా నటించిన మంజిమా మోహన్ మాత్రం ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు చాలామందికి. వాట్స్ ది రీజన్??

అబ్బే ఏం లేదు. నిజానికి మంజిమా చాలా చబ్బీగా బాగుంది. చాలామంది ఆడియన్స్ కు నచ్చినట్లే నచ్చింది. కాని.. ఏదో తేడా కొట్టేసిందే అనే ఫీలింగ్ ఉంది చూశారూ.. ఆ ఫీలింగ్ మాత్రం గౌతమ్ మీనన్ క్రియేట్ చేశాడు. యాక్చువల్ గా సమంత హిట్టయినప్పుడు.. కేవలం ఆమె గుడ్ లుక్స్ మాత్రమే కాదు.. ఆమె సక్సెస్ లో సగం శాతం ఆ వాయిస్ కు కూడా ఇవ్వాలి. సింగర్ చిన్మయి అందిస్తున్న ఆ వాయిస్ కారణంగానే చాలా మ్యాజిక్ జరిగింది. గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆ వాయిస్ అండ్ సమంత ఫేస్ ను కలసి చూడ్డానికి అలవాటు పడిపోయారు.

అందుకే ఇప్పుడు చిన్మయి సమంతకు కాకుండా వేరే హీరోయిన్లకు డబ్బింగ్ చెబితే.. అది సెట్టవ్వట్లేదు. అదిగో మంజిమా మోహన్ ను కాసేపు చూశాక.. ఏదో తేడాగా ఉందే అనే ఫీలింగ్ వచ్చేలా చేస్తోంది ఆ వాయిస్. ఒకవేళ వేరే ఎవరన్నా వాయిస్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పుంటే.. మంజిమా రీచ్ వేరేలా ఉండేదేమో. డాట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News