ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే.. అందం, అదృష్టం మాత్రమే ఉంటే సరిపోదు. మంచి మాటకారి కూడా అయ్యుండాలని ఈ కేరళ కుట్టీని చూస్తే అర్థమైపోతుంది. ఇవాళ రేపు సినిమాలతో కన్నా ఎక్కువగా.. సోషల్ మీడియాలోనే ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు హీరోయిన్లు. పిక్స్ షేర్ చేయడం నుంచి.. క్వశ్చన్ అవర్ నిర్వహించడం వరకూ కంటిన్యూ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
లేటెస్ట్ గా కేరళ క్రేజీ హీరోయిన్ మాంజిమా మోహన్ ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఆమె ఆఫర్ ఇచ్చేయడంతో.. ఎవరికి వారు తమకు తోచిన ప్రశ్నలన్నీ అడిగేశారు. ఈ క్రమంలోనే తుంటరి పిల్లాడు.. చిలిపి ప్రశ్న వేశాడు.
మీరు సింగిల్ గా ఉన్నారా? కమిటెడా? అనే ధర్మ సందేహం అడిగాడు. మాంజిమా ఎంతటి మాటకారో.. ఆమె ఇచ్చిన సమాధానమే అర్థం చేయిస్తుంది. ఈ ప్రశ్నకు ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా ఓ ఎవర్ గ్రీన్ మీమ్ షేర్ చేసింది. ఈ మీమ్ లో.. చిన్నారులు క్లాసులో భోజనం చేస్తుంటారు. అందులో ముందు బేంచీలో కూర్చున్న బాలిక తన పక్కనున్న ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ ఉంటుంది. ఆ బెంచీ వెనకాల కూర్చున్న మరో బాయ్ భోజనం చేస్తూనే యాంగ్రీ ఫీలింగ్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటాడు.
ఇది ఎంతో పాపులర్ అయిన మీమ్. దీన్ని పోస్ట్ చేసిన మాంజిమా.. తన పరిస్థితి కూడా ఇలాగే ఉందని రిప్లే ఇచ్చింది. అంతే.. ఈ మీమ్ ఒక్కసారిగా తెగ వైరల్ అయిపోయింది. ఆమె పెట్టిన మీమ్ చూసి నవ్వనివారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు. మీరు కూడా మళ్లీ ఓ లుక్కేసి.. మనసారా నవ్వుకోండి.