ఈ పిల్ల అమెరికా నుండి వచ్చిందండీ

Update: 2018-02-15 07:00 GMT

మన సెలబ్రెటీల వారసులు తెలుగు సినిమాల్లోకి రావడానికి చాలానే ఇష్టపడతారు. కానీ అందులో చాలా మందికి తెలుగు సరిగ్గా రానే రాదు. మరికొంత మందికి అయితే అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు. అందుకు కారణం లేకపోలేదు. సాధారణమైన వారి పిల్లలే ఇంగ్లీష్ మీడియం మోజులో పడి తెలుగును పట్టించుకోవడం లేదు. ఇక అమెరికాలో చదివిన వారికి ఎలా తెలుస్తుంది.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ సైడ్ నుంచి లేడి గ్యాంగ్ వస్తోంది. మహేష్ సిస్టర్ మంజుల మనసుకు నచ్చింది అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది.  చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమలను కూడా చాలా స్పీడ్ గా జరుపుతోంది. అయితే మహేష్ మేన కోడలు మంజుల కూతురు జానవి కూడా ప్రమోషన్స్ లో తెగ పాల్గొంటోంది. ఎందుకంటే సినిమాలో ఈ చిన్నారి కూడా ఒక స్పెషల్ రోల్ చేసింది. అయితే జానవి కి తెలుగు అస్సలు రాదట.

ఎదో ఇక్కడ వాతావరణం రీసెంట్ గా టచ్ అవ్వడంతో అలా అలా ఇప్పుడే అలవాటు చేసుకుంటోంది. అమెరికా నుంచి నుంచి అప్పుడే వచ్చిన నటి లాగా.. నాకు తెలుగు వస్తుంది.. బట్.. కాంప్లికేటెడ్ తెలుగు రాదు అనేలా అచ్చమైన ఇంగ్లీష్ మాడ్యులేషన్ లోనే తెలుగుని టచ్ చేస్తోంది. ఇక  మామయ్య మహేష్ తో నటించడానికి రెడీ అని కూడా అనేసింది. మనసుకు నచ్చింది సినిమాలో తెలుగు మాట్లాడటం చాలా కష్టమైపోయిందట. ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానో అని ప్రతి సారి ఆలోచించానని చెప్పుకుంది. అయితే జానవి ఇలా కాంప్లికేటెడ్ తెలుగులో మాట్లాడటానికి అసలు కారణం ఆమె చిన్నప్పటి నుండి అమెరికాలోనే పుట్టిపెరిగింది. అది సంగతి.



Tags:    

Similar News