మన్మథుడు 2 ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?

Update: 2019-08-11 14:30 GMT
ఇవాళ సక్సెస్ మీట్ లో నాగార్జున మన్మథుడు 2 సూపర్ హిట్ అని తొలుత అసలు మన్మథుడు కూడా యావరేజ్ టాక్ తోనే మొదలై తరువాత క్లాసిక్ గా మారిందని చెప్పుకొచ్చాడు కానీ పబ్లిక్ టాక్ తో పాటు అంతకంతకూ తగ్గుతున్న కలెక్షన్లను చూస్తే వాస్తవం ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. నాగ్ చేయాల్సిన సబ్జెక్టు కాదని అభిమానులే మొహమాటం లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక మార్కెట్ కొంత డౌన్ లో ఉన్న నాగ్ కు మన్మథుడు 2 చిన్న దెబ్బ కాదు.

ఇప్పుడు దీని ప్రభావం త్వరలో స్టార్ట్ కాబోయే బంగార్రాజు మీద ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. అందులో కూడా ఇదే తరహాలో రసికరాజుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ రేంజ్ లో క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. ఇప్పుడు మన్మథుడు 2 మీద వస్తున్న కామెంట్స్ ని పరిగణనలోకి తీసుకుని మార్పులు చేసే అవకాశం లేకపోలేదని వినికిడి. తొలుత బంగార్రాజు పట్ల సాఫ్ట్ గా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒప్పుకోవడం అనుమానమే అని మరో న్యూస్. ఇవన్నీ ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చలే తప్ప ఖరారుగా జరుగుతున్నాయని కాదు.

మరోవైపు బోల్డ్ గా చేయడానికి కూడా సై చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ మీద ఇప్పుడీ ఫలితం ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. యావరేజ్ అనే టాక్ వచ్చినా పరిస్థితి ఇంకోలా ఉండేది కానీ సోషల్ మీడియాలో జనం ఈ విషయంలో ఏ మాత్రం జాలి చూపకుండా మన్మథుడు 2కి క్లాస్ పీకుతున్నారు. రచయిత శ్రీధర్ సీపాన ఓ వీడియో ద్వారా నాగ్ గారు ఇలాంటి సినిమాలు చేయకండి అని చెప్పడం ఇప్పటికే వైరల్ అయ్యింది. మొత్తానికి మన్మథుడు 2 షాక్ మాములుగా లేదు.
Tags:    

Similar News