మ‌న్మ‌ధుడి సేఫ్ గేమ్‌ ఎన్ని రోజుల్లో?

Update: 2019-08-08 09:24 GMT
నాగార్జున `మ‌న్మ‌ధుడు 2` ఈ శుక్ర‌వారం (ఆగ‌స్టు9) ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్.. ట్రైల‌ర్ తో హైప్ పెంచారు. కింగ్ లేటు వ‌య‌సు ఘాటు రొమాన్స్ గురించి యూత్ లో ముచ్చ‌టించుకుంటున్నారు. ఇవ‌న్నీ ఈ సినిమాకి ప్ర‌చారం ప‌రంగా క‌లిసొచ్చాయి. ఇక ఈ చిత్రంలో ర‌కుల్ అంద‌చందాల ట్రీట్ పైనా ఫ్యాన్స్ లో బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. స‌రిగ్గా మూడు నాలుగు రోజులు సెల‌వు దినాల్ని లెక్క‌లేసి టైమ్ చూసి మ‌న్మ‌ధుడిని థియేట‌ర్ల‌లోకి వ‌దులుతున్నారు.

ఇక ఈ సినిమా ఎంత వ‌సూళ్లు థియేట‌ర్ల నుంచి తెస్తే సేఫ్ అయిన‌ట్టు? అంటే సుమారు 18 -20 కోట్ల మేర షేర్ థియేట‌ర్ల నుంచి వ‌సూలు చేస్తే సేఫ్ గేమ్ ఆడిన‌ట్టేన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ బిజినెస్ 18 కోట్లు. ఏరియాల వారీగా ప‌రిశీలిస్తే.. నైజాం-5.5 కోట్లు.. సీడెడ్- 2.5 కోట్లు.. ఆంధ్రా- 7 కోట్లు.. ఆంధ్రా నైజాం- 16.5 కోట్లు.. ఇత‌ర భార‌త‌దేశంలో 1.60 కోట్లు బిజినెస్ చేసింది. ఓవర్ సీస్- 1.75 కోట్లు ప‌లికింది. ఓవ‌రాల్ గా 18 కోట్ల మేర బిజినెస్  సాగించింది. ఆ మేర‌కు థియేట‌ర్ల నుంచి షేర్ వ‌సూలు చేస్తే చాల‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆదివారం సెల‌వు.. బ‌క్రీద్ సెల‌వు.. ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర  దినోత్స‌వ సెల‌వు ఇవ‌న్నీ క‌లిసొస్తే చాలు ఈ వ‌సూళ్లు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మ‌న్మ‌ధుడు నాన్ థియేట్రిక‌ల్ ప‌రిశీలిస్తే.. డిజిటిల్ రైట్స్‌ను ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ 7.4 కోట్లకు చేజిక్కించుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్‌ 6 కోట్లకు అమ్మారు. క‌ర్నాట‌క‌- బెంగ‌ళూరు బెట‌ర్ ప్రైజ్ కి అమ్మార‌ట‌. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌- ఆనంది ఆర్ట్స్‌- వ‌యకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

    

Tags:    

Similar News