లెహంగా అందాలతో మన్నారా మనసులు దోచుకుంటోందిగా..!

Update: 2021-05-07 02:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రభామలు ఎంతమంది ఉన్నా గ్లామర్ ఒలికించే సుందరాంగులకు ఆ క్రేజే వేరు. అలాంటి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది మన్నారా చోప్రా. ఈ హర్యానా వయ్యారి 22ఏళ్ల వయసులోనే 'ప్రేమ గీమా జాంతా నై' అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వకపోయే సరికి అమ్మడు అదే ఏడాది జిద్(2014) అనే సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఫస్ట్ సినిమాతోనే అమ్మడు ఓ రేంజిలో స్కిన్ షో చేయడంతో పాటు ఘాటు ముద్దు సన్నివేశాలలో.. రొమాన్స్ సీన్స్ అదరగొట్టి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. జిద్ మూవీ మన్నారాకు హిందీలో ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. ఆ సినిమా అనంతరం వెంటనే మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.

జక్కన్న - తిక్క - రోగ్ సినిమాలలో లీడ్ రోల్స్ పోషించింది. కానీ ఏ సినిమా కూడా మన్నారాకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికి మన్నారా కెరీర్ పరంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. అలాగే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది. అన్నట్లు ఈ వయ్యారి తిక్క - రోగ్ సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్ గా స్పెషల్ జ్యూరీ అవార్డులు కూడా అందుకుంది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ ఈ సుందరి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా కజిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా అమ్మడు ఓ ట్రెడిషనల్ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో మన్నారాను అంత పద్ధతిగా చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఎందుకంటే లెహంగాలో వయ్యారి సోయగాలు క్లియర్ గా బయటపెట్టింది. కానీ అందమైన ఆభరణాలు అమ్మడి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రస్తుతం మన్నారా ఫోటో ఇంస్టాగ్రామ్ లో హల్చల్ చేస్తోంది.
Tags:    

Similar News