జ్యోతిలక్ష్మీ సినిమాను మైనస్ చేసి చూస్తే గత మూణ్నాలుగేళ్లుగా టాలీవుడ్‌లో ఛార్మి పరిస్థితేంటో అరదరికీ తెలుసు. పెద్ద సినిమాల్లో అస్సలు అవకాశాల్లేవు. ఆమె చేసిన చిన్న సినిమాలేవీ నిలబడలేదు. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసి పెళ్లేదో చేసుకుని సెటిలైపోతే బెటర్ అని అందరూ అంటుండగా సడెన్‌గా పూరి జగన్నాథ్ లాంటి క్రేజీ డైరెక్టర్‌తో 'జ్యోతిలక్ష్మీ' చేసే ఛాన్స్ కొట్టేసింది పంజాబీ ముద్దుగుమ్మ. ఈ దెబ్బతో టాలీవుడ్‌లో మళ్లీ ఛార్మి పేరు బాగా వినిపిస్తోంది. రాబోయే శుక్రవారం 'జ్యోతిలక్ష్మీ' మంచి క్రేజ్ మధ్య విడుదల కాబోతోంది.
ఒక వేళ ఈ సినిమా హిట్టయినా ఛార్మి జాతకం తిరగబడిపోతుందని అనుకోవడానికేమీ లేదు. అందుకే సందట్లో సడేమియా అన్నట్లు చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఉన్న ఛార్మి సినిమా 'మంత్ర-2'ను కూడా థియేటర్లలోకి దించేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే 'జ్యోతిలక్ష్మీ' వచ్చిన తర్వాతి వారమే ఈ హార్రర్ సినిమాను కూడా విడుదల చేసేయాలని చూస్తున్నారట. అలా కాదంటే చివరి వారంలో రిలీజ్ చేస్తారట. అప్పట్లో ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన 'మంత్ర' ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఐతే మంత్ర-2కు కొత్త దర్శకుడు పని చేశాడు. పేరు ఎస్వీ సతీష్. లేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతాన్నందించాడు. చూద్దాం.. మంత్ర-2 కూడా మంత్ర లాగే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో.