'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా పరిచయమైన శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం ''మను చరిత్ర''. ఇందులో శివ సరసన మేఘా ఆకాష్ - ప్రియ వడ్లమాని - ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ పెదగాని ఈ మూవీతో దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. నోట్లో సిగరెట్, చేతిలో పువ్వు, ఒళ్లంతా రక్తం గాయాలతో ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ముఖ్యంగా ఫెరోషియస్ అవతారంలో ఉన్న శివ ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మను చరిత్ర ముందుమాట' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.
'వాడు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.. వాడి ఏడుపు దేవుడికి వినిపించే అంత.. మనుషులకు అర్థం కానంత' అని చెప్పే డైలాగ్ తో ఈ ప్రీఫేస్ ప్రారంభమైంది. టీజర్ చూస్తుంటే 'మను చరిత్ర' రెండు విభిన్న కాలాలలో సెట్ చేయబడిన కథ అని తెలుస్తోంది. ఇందులో శివ కందుకూరి పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. శివ ఈ చిత్రంలో మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ చూపించాడు. 'ప్రేమలో పడటం బాధాకరమైన ఆనందం' అనే కోట్ ఈ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది.
దర్శకుడు భరత్ పెదగాని విలక్షణమైన తీవ్రమైన ప్రేమ మరియు యాక్షన్ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మొత్తం మీద 'మను చరిత్ర' టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పణలో యాపిల్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్. శ్రీనివాసరెడ్డి - రాన్సన్ జోసెఫ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'మను చరిత్ర' చిత్రంలో సుహాస్ - డాలి ధనంజయ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - మధునందన్ - రఘు - దేవీప్రసాద్ - ప్రమోదిని - సంజయ్ స్వరూప్ - హర్షిత - గరిమ - లజ్జ శివ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాహుల్ శ్రీవాత్సవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు.
Full View