మిస్ వ‌ర‌ల్డ్ ఎంత‌ క‌వ్వించినా కానీ!

Update: 2019-04-05 13:07 GMT
2017 లో ప్ర‌పంచ సుంద‌రి కిరీటం ద‌క్కించుకుంది మానుషి చిల్ల‌ర్. అప్ప‌టి నుంచి బాలీవుడ్ లో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేయాల‌ని ఉవ్విళ్లూరుతోంది. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్, స‌ల్మాన్ లాంటి స్టార్ రేంజ్ హీరోల‌తో న‌టించాల‌ని ఉంద‌ని మీడియా ఇంట‌ర్వ్యూల్లో ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. కానీ ఎందుక‌నో ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయ‌డంలో ఫెయిలైంది.

ఆ క్ర‌మంలోనే మిస్ వ‌ర‌ల్డ్ అర్హ‌త‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని పేరు తెచ్చుకుంది. ప్ర‌పంచ సుంద‌రి కేట‌గిరీలో టాప్ మోడ‌ల్ గా ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌మోట‌ర్ గా ఆదాయాన్ని భారీగానే ఆర్జిస్తోంది. అయితే ఆశించిన బాలీవుడ్ కెరీర్ మాత్రం అంద‌ని ద్రాక్షే అయ్యింది. ఆ క్ర‌మంలోనే మానుషి ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో వేడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌ఖ్యాత‌ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫోటో షూట్ల‌తోనూ ఈ అమ్మ‌డు చెల‌రేగుతూనే ఉంది.

తాజాగా స‌భ్య‌సాచి ఫోటోషూట్ తో మ‌రోసారి అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈ ఫోటోషూట్ ఎంత ట్రెడిష‌న‌ల్ గా సాగిందో అంతే క‌వ్వించేలా అందాల‌ను ఆర‌బోసింది మానుషి. స‌ముద్రం రంగు.. ఆకాశం రంగు .. ఆ బులుగు జిలుగుకు మ్యాచ్ అయ్యే కాంబినేష‌న్ డిజైన‌ర్ డ్రెస్ లో మానుషి ఆక‌ట్టుకుంది. ఇది డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హా డిజైన‌ర్ లుక్ అంటూ ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేయ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అలాగే ఓ విమానంలోంచి దిగొస్తున్న రాకుమారి లుక్ లోనూ మానుషి మ‌తి చెడగొట్టింది. క్వీన్ ఆఫ్ ట్రాపిక్స్ అంటూ ఈ ఫోటోషూట్ కి క‌వులు చ‌క్క‌ని టైటిల్ కూడా ఇచ్చారు. వేరొక ఫోటోలో సైకిల్ తో న‌డిచొచ్చే చెలిక‌త్తె గెట‌ప్ లోనూ క‌నిపించింది. ఇక ఈ ఫోటోషూట్ లో కాస్ట్ లీ బ్రాండ్ కాంబినేష‌న్ క‌ళ్ల‌ద్దాల‌తో మెరుపులు మెరిపించింది. ఈ అమ్మ‌డి క‌ష్టం చూసి ఇక‌నైనా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పిలిచి అవ‌కాశాలిస్తారేమో? 
Tags:    

Similar News