బిగ్ బాస్‌ ఫినాలేకు చాలా మంది గెస్ట్‌ లు

Update: 2021-12-14 04:45 GMT
తెలుగు బిగ్ బాస్ ముగింపు అంకం దగ్గర పడింది. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. గత రెండు సీజన్ లుగా వరుసగా చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నాడు. మరి ఈ సీజన్ కు ఎవరు స్పెషల్‌ గెస్ట్‌ అనే చర్చ జరుగుతున్న సమయంలో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఈ వారం స్పెషల్ గెస్ట్ లు వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌ లో భాగంగా తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకునేందుకు స్టార్స్ క్యూ కట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొదటగా బాలీవుడ్‌ క్రేజీ బ్యూటీఫుల్‌ కపుల్‌ దీపిక పదుకునే మరియు రణవీర్ సింగ్ లు తమ 83 సినిమా ప్రమోట్‌ చేసుకునేందుకు బిగ్‌ బాస్ స్టేజ్‌ పై సందడి చేయబోతున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ వారు 83 సినిమా ను తెలుగు లో సమర్పిస్తున్నారు. దాంతో నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ వారిద్దరిని బిగ్‌ బాస్ స్టేజీపై చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు ఇంకా ఆలియా భట్‌ కూడా బిగ్‌ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్‌ పై కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పెద్ద సినిమాలు వరుసగా విడుదలకు సిద్దంగా ఉన్నాను.

కనుక ఆ సినిమాల ప్రమోషన్ కోసం బిగ్ బాస్‌ స్టేజీ మీద స్టార్స్ సందడి చేయబోతున్నట్లుగా మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎవరు ఫినాలే ఎపిసోడ్‌ లో కనిపిస్తారు అనేది చివరి రోజు వరకు సస్పెన్స్ గానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 లో టాప్‌ 5 గా ప్రస్తుతం హౌస్ లో సన్నీ.. షన్నూ.. సిరి.. శ్రీరామ్‌ మరియు మానస్ లు ఉన్నారు. ఇటీవలే కాజల్ ఎలిమినేట్‌ అయ్యింది. వీరిలో బిగ్‌ బాస్ సీజన్‌ 5 ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ట్రోఫీ విన్నర్ ఎవరు అనే విషయం పక్కన పెడితే టాప్ 3 మాత్రం సన్నీ.. షన్నూ మరియు శ్రీరామ్‌ లు ఉంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్.. షన్నూ కోసం వైజాగ్‌ లో భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక సన్నీ మరియు శ్రీరామ్‌ లకు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా వారి వారి టీమ్స్ ప్రచారం చేస్తున్నాయి. కనుక ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చాలా కష్టమైన విషయం. విన్నర్ కు ఎవరి చేతుల మీదుగా ట్రోఫీ ని ఇప్పిస్తారు అనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News