సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకున్న అమ్మాయిలకు ఆరంభంలో చాలా అవమానాలు.. ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు కాస్త పర్వాలేదు కానీ ఒకప్పుడు మరీ దారుణంగా హీరోయిన్ అవ్వాలి అనుకున్న అమ్మాయిలను వాడుకునే వారు. అవమానించే వారు అంటూ టాక్ ఉండేది.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోయిన్స్ తమ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్తే ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి.
కెరీర్ ఆరంభంలో చాలా సార్లు సినిమాల్లో ఎంపిక చేసుకుని కొన్నాళ్ల పాటు షూటింగ్ నిర్వహించి చెప్పకుండానే తొలగించి మరో హీరోయిన్ తో షూట్ చేసేవారు. అలా చాలా సార్లు చేదు అనుభవం ఎదురయ్యిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతాయి అంటూ రకుల్ పేర్కొంది. ఆత్మ విశ్వాసంతో అడుగులు వేశాను కనుకే ఈ స్తాయికి నేను చేరుకున్నాను. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ లో అవకాశాలు కానీ మరేదైనా కానీ ఈజీగా దొరకాలని నేను కోరుకోలేదు అంటూ రకుల్ పేర్కొంది. కొత్తగా వచ్చే అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాలని ఆమె సూచించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.