దక్షిణాది చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలంటే అది ఒక్క కమల్ హాసన్ సినిమా అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. టైమ్ నడుస్తోంది. ఈ తరహా చిత్రాలు వచ్చాక లిప్ లాక్ ల ట్రెండ్ తెలుగు సినిమాల్లో సర్వసాధారణం అయిపోయింది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఎందెందు చూసినా లిప్ లాక్ తప్పనిసరి అయ్యింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఇది కీలకంగా మారిపోయింది. యూత్ ని ఆకర్షించడం కోసం మన దర్శకహీరోలు లిప్‌లాక్ సన్నివేశాలకు మొహమాటం లేకుండా సై అనేస్తున్నారు.
తాజాగా కార్తి చిత్రంలోనూ ఓ లిప్ లాక్ సీన్ ఉన్నట్టు తెలిసింది. `ఖైదీ` వంటి బ్లాక్ బస్టర్ తరువాత కార్తి హీరోగా నటిస్తున్న `దొంగ` రొటీన్ కి డిఫరెంట్ గా ఉండనుంది. హీరోయిన్ గా అల్లరి నరేష్ నాయిక.. `మేడమీద అబ్బాయి` ఫేమ్ నిఖిలా విమల్ నటిస్తోంది. ఇందులోని ప్రారంభ సన్నివేశాల్లో కార్తి- నిఖిలా విమల్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలున్నాయట.
ఈ సన్నివేశాల్లో ఎలా నటించాలా అని తొలుత భయపడ్డానని అయితే హీరో కార్తి ఇచ్చిన సలహాల కారణంగా చాలా ఈజీగా చేశానని చెప్పుకొచ్చింది నిఖిల. కార్తి కిస్ థెరపీ ఏమైనా చేశాడా? అంత ఈజీగా నిఖిలా లిప్ లాక్ సీన్ లలో ఎలా చేసింది? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మలయాళ `దృశ్యం` ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికి సోదరిగా జ్యోతిక నటిస్తున్నారు. ఆమె పాత్రే ఇందులో కీలకం. అక్క తమ్ముడు అనుబంధాన్ని ఇందులో హైలైట్ గా చూపిస్తున్నారట.
ఇక దొంగ సినిమా కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్. ఇంటి నుంచి చిన్నతనంలోనే పారిపోయి 15 ఏళ్ల తరువాత తిరిగొచ్చిన యువకుడిగా హీరో కార్తి కనిపించబోతున్నారు. కొత్త తరహా కథా కథనాలతో వస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వదిన జ్యోతికతో కలిసి కార్తి తొలిసారి నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే వున్నాయి. ఇటీవల దొంగ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో కార్తీ-నిఖిలా- సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.