మారుతి కొత్త చిత్రం అక్క‌డే..మ‌రి హీరో ఎవ‌రు?

Update: 2018-07-20 09:21 GMT
నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా `శైల‌జారెడ్డి అల్లుడు` తీస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు మారుతి. ఆగ‌స్టు 31కి ఆ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప‌నిలో ఉన్నారాయ‌న‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి ఓ సినిమా చేయాల్సి ఉండ‌టంతో - అది `శైల‌జారెడ్డి అల్లుడు`గా తీస్తున్నాడు.  త‌దుప‌రి మాత్రం  ఆయ‌న మ‌ళ్లీ గీతాఆర్ట్స్‌లోకి రాబోతున్నాడు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`లాంటి సినిమాని గీతా ఆర్ట్స్‌లోనే తీశాడు  మారుతి.  త‌దుప‌రి మ‌ళ్లీ ఈ కాంబోలో సినిమా అంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. హీరో హీరోయిన్లు ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా ఫైన‌లైజ్ కాలేదు.

ఈసారి మారుతి అగ్ర క‌థానాయ‌కుల‌తోనే సినిమా చేయొచ్చ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మ‌రి మారుతి లిస్ట్‌లో ఉన్న ఆ  అగ్ర క‌థానాయ‌కులు ఎవ‌ర‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అల్లు అర్జున్‌ తో సినిమా తీయాల‌ని మారుతికి ఎప్ప‌ట్నుంచో ఉందట‌. నిజానికి ఆయ‌న‌కి త‌గ్గ క‌థ వినిపిస్తే బ‌న్నీ కూడా మారుతికి సుల‌భంగానే గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేస్తాడు. ఆ కుటుంబంతో మారుతికి ఉన్న అనుబంధం అలాంటిది. పైగా అల్లు అర్జున్‌ కి మారుతి మంచి ఫ్రెండ్ కూడా. మ‌రి మారుతి నిర్ణ‌యం ఏంట‌న్న‌దే  ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది. మ‌రొక‌సారి మిడిల్‌ రేంజ్ హీరోల‌తోనే మారుతి సినిమా చేస్తాడా లేదంటే - స్టార్ల‌తోనా అనేది తెలియాలంటే `శైల‌జారెడ్డి అల్లుడు` విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందేనేమో.
Tags:    

Similar News