ఓవైపు బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ 3డి- సలార్ - ప్రాజెక్ట్ -కె అతి భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్నవి. అయితే వీటన్నిటి మధ్యా అతడు మారుతి సినిమాకి సంతకం చేయడం ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ కి ఉన్న అసాధారణ స్టార్ డమ్ దృష్ట్యా మారుతికి ఇది జాక్ పాట్ లాంటిదే.
ఈ సినిమా ఈ నెలలోనే లాంచ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే వాయిదాకి కారణమేమిటీ అంటే..? ప్రస్తుతం మారుతి వర్క్ చేస్తున్న స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ కోరినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ 40 కాల్షీట్లు కేటాయించినట్లు కూడా గుసగుస వినిపిస్తోంది.
ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ కథాంశంతో కామెడీ బేస్ చేసుకుని ఉంటుందని సమాచారం. కొన్ని వారాల క్రితం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. బహుశా శస్త్ర చికిత్స కారణంగా అతడు చిన్న బడ్జెట్ సినిమాతో ఆకస్మికంగా తెరపైకొస్తాడా? అన్నది వేచి చూడాలి.
మోకాలికి మైనర్ సర్జరీ..!
మోకాలి నొప్పితో బాధపడుతూనే రాధే శ్యామ్ షూటింగును ప్రభాస్ పూర్తి చేసాడని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లాడు. ఇది మైనర్ శస్త్ర చికిత్స అన్న టాక్ వినిపించింది. అయితే ప్రభాస్ కు శస్త్ర చికిత్స ఎంత మైనర్ అయినా కానీ..వైద్య ప్రక్రియ నుండి కోలుకునే వరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినందున ప్రభాస్ రాబోయే 2-3 నెలలు షూటింగ్ లో ఉండడన్న టాక్ వినిపించింది.
ఇది మోకాలి ఆపరేషన్ అని గుసగుస వినిపించింది. సాహో సినిమా యాక్షన్ సన్నివేశాల సమయంలో అతని కాలికి గాయమైంది. కొన్నాళ్ల క్రితమే అతనికి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే చికిత్స సమయం-నిర్దిష్టమైనది కాదు. దాంతో ప్రభాస్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా జాప్యం జరిగింది. ఇప్పుడు అతను చివరకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ప్రశాంత్ (కెజిఎఫ్) నీల్ సాలార్ .. అశ్విని దత్- నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ కె వంటి కొన్ని ప్రధాన చిత్రాల షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందన్న టాక్ కూడా ఉంది. ప్రభాస్ పూర్తిగా కోలుకుని రెడీ అయిన వెంటనే తిరిగి ప్రారంభించవలసి ఉంటుంది. అతను శ్రీరాముడిగా నటించిన తన తదుపరి చిత్రం ఆదిపురుష్ షూటింగ్ ను పూర్తి చేశాడు.